https://oktelugu.com/

BirdFlu: చికెన్ షాపులు బంద్.. చికెన్ తినేవారికి ఇది హెచ్చరిక

బర్డ్‌ ఫ్లూతో చనిపోయిన కోళ్లను ఎవరూ తినొద్దని తెలిపారు. చనిపోయిన కోళ్లను పాతిపెట్టాలని, బయట పడేయవద్దని పేర్కొన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 16, 2024 2:01 pm
    BirdFlu
    Follow us on

    BirdFlu: మూడేళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డ తెలుగు ప్రజలను మరో మహమ్మారి భయపెడుతోంది. బర్డ్‌ ఫ్లూ వేగంగా తరుముకొస్తోంది. కొన్ని నెలలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బర్డ్‌ ఫ్లూతో కోళ్లు చనిపోతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పొదలకూరు, కోవూరు మండలాల్లో బర్డ్‌ ఫ్లూ బయటపడింది. ఈ వైరస్‌తోనే కోళ్లు చనిపోతున్నాయని నిర్ధారించారు. మొన్నటి వరకు కేరళకే పరిమితమైన వైరస్‌.. ఇప్పడు ఏపీలోకి ఎంటర్‌ అయింది.

    వేగంగా వ్యాప్తి..
    నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ వేగంగా వ్యప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. పొదలకూరు, కోవూరులో తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారి ఆదేశించారు. వెంటనే గ్రామాల పరిధిలోని పది కిలోమీటర్ల వరకు మూడు రోజులు చికెన్‌ షాపూలు మూసివేయించాలని ఆదేశించారు. కిలోమీటర్‌ పరిధిలోని షాపులు మూడు నెలల వరకు తెరవకుండా చూడాలని సూచించారు.

    చినిపోయిన కోళ్లును ఇలా..
    ఇక బర్డ్‌ ఫ్లూతో చనిపోయిన కోళ్లను ఎవరూ తినొద్దని తెలిపారు. చనిపోయిన కోళ్లను పాతిపెట్టాలని, బయట పడేయవద్దని పేర్కొన్నారు. కోళ్ల ఫాంలు, చికెన్‌ షాపుల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోడి గుడ్ల, చికెన్‌ తినకపోవడం చాలా మంచిదని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చికెన్‌ అమ్మకాలు పడిపోయాయి. ప్రజలు తినడం మానేశారు.

    మేడారం జాతర వేళ..
    ఇక అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉన్న మేడారం జాతర వేళ.. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ సోకడం కలకలం రేపుతోంది. జాతర అంటేనే కోళ్లు, మేకలు కచ్చితంగా ఉంటాయి. ఈ సమయంలో వైరస్‌ సోకడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మేడారం జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇక కోళ్లు, మేకలను వ్యాపారులు తెలుగు రాష్ట్రాలతోపాటు, పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్‌గడ్‌ నుంచి దిగమతి చేస్తారు. వీటితోపాటు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చాలా మంది భయపడుతున్నారు. ఇప్పటికే జాతర నేపథ్యంలో కోట్ల కొద్ది కోళ్లను లక్షల కొద్ది మేకలను డంప్‌ చేశారు వ్యాపారులు ఇందులో వైరస్‌ ఉన్న కోళ్లు వస్తే జాతర కారణంగా తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా వైరస్‌ సోకే అవకాశం ఉంది.