Young Men Who Rebelled: హైదరాబాద్ లో రోజుకో దారుణం వెలుగు చూడాల్సి వస్తోంది. క్షణికావేశంలో యువకుల మధ్య ప్రారంభమైన చిన్న గొడవలు పెద్దవిగా మారుతున్నాయి. ఈ ఘర్షణలో ఎవరో ఒకరివి ప్రాణాలు పోతున్నాయి. తాజాగా నగరంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఒకరి ప్రాణం పోయింది. ఓ అమ్మాయిపై అసభ్యంగా కామెంట్ చేశారని మరో యువకుడు తిరిగి దాడి చేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ ఘటనలో కొందరి యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ టీ షాపు దగ్గరికి పవన్ అనే యువకుడు తన చెల్లెలితో పాటు మరో యువతి తో కలిసి వచ్చాడు. రాత్రి 11.30 గంటలకు టీ తాగడానికి వారు ఇక్కడికి వచ్చారు. ఇదే సమయంలో ఈ టీ షాపు వద్ద వెంటటరమణ అనే వ్యక్తితో పాటు మరికొందరు యువకులు అక్కడ ఉన్నారు. అయితే పవన్ తో వచ్చిన యువతులపై వెంకటరమణ మద్యం మత్తులో ఏదో కామెంట్ చేశాడు. ఇది విన్న పవన్ .. వెంకట రమణపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంకట రమణ స్నేహితులు పవన్ ను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ స్నేహితులు సంఘటన ప్రదేశానికి వచ్చారు. ఇరు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకంది.
ఈ క్రమంలో పవన్ పక్కనే ఉన్న హోటల్ లోని చపాత కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత వెంకట రమణను తన స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందాడు. దీంతో పవన్ తో పాటు మరికొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిది ఆసిఫాబాద్ జిల్లా అని పోలీసులు చెబుతున్నారు. అయితే తన చెల్లిపై కామెంట్ చేసినందుకే తాను దాడి చేసినట్లు పవన్ ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా దాడికి సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డ్ అయింది. ఈ సంఘటన నవంబర్ 22న జరిగినట్లు గా తెలుస్తోంది. అయితే నగరంలో పలు చోట్ల రాత్రిళ్లు ఇలాంటి గొడవలు ఎక్కువగా ఉంటున్నాయని, పోలీసులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. క్షణికావేశం తోనే ఈ గొడవ జరిగిందని భావిస్తున్నా.. గ్రూపులుగా ఏర్పడడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. దీంతో ఆయా ప్రదేశాల్లో ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మద్యం మత్తులో ఉన్న యువకులు టీ షాపుల వద్ద అల్లరి చేస్తున్నారు.