Sandhya Theatre Incident: భారత దేశంలోని న్యూస్ ఛానెళ్లు ఎక్కువగా పొలిటికల్ అంశాలపై డిబేట్లు నిర్వహిస్తుంటాయి. ఏరోజు కారోజు జరిగిన అంశాలపై వివిధ పార్టీల లీడర్లతో డిబేట్‌లు ఏర్పాటు చేస్తాయి. ఇలాంటి డిబేట్‌లలో కొందరు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరికొందరు డిబేట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. టీవీ లైవ్‌లో పాల్గొన్న వ్యక్తిపై కాంగ్రెస్ నేత దాదాగిరి చేశాడు. ‘లైవ్ జరుగుతుండగానే ఏమనుకుంటున్నావ్.. నాపేరు ఎందుకు తీసినవ్.. నీ గురించి తెల్వదనుకుంటున్నావా అంటూ బీఆర్‌ఎస్ నేతకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. ధమ్కీ ఇచ్చిన వ్యక్తి సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేసిన వ్యక్తుల్లో ప్రధాన నిందితుడు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో..
యూత్ కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్ సినిమా హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడు. కొన్ని రోజులుగా తెలంగాణలో పుష్ప 2 సినిమా బెనిఫిట్‌షో రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనపై చర్చ జరుగుతోంది. ఇది రాజకీయరంగు కూడా పులుముకుంది. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ పేరుతో ఆరుగురు దాడి కూడా చేశారు. దీంతో టీవీల్లో దీనిపై డిబేట్లు నిర్వహిస్తోంది. మంగళవారం సాయంత్రం రిపబ్లిక్ టీవీ ఛానెల్ డిబేట ఏర్పాటు చేసింది. దీనికి బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ హాజరయ్యాడు. దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రెడ్డి శ్రీనివాస్ డిబేట్‌లో పాల్గొన్న మన్నె క్రిశాంక్‌కు ఫోన్ చేశాడు. అతని పేరు ఎత్తినందుకు ధమ్కీ ఇచ్చాడు. నీ సంగతి తెలుసు. వేస్ట్ పర్సన్‌వు నువ్వు. నీవల్ల వచ్చిందేంది.. పోయేదేంది.. నాపేరు ఎందుకు తీసినవ్ ఏమనుకుంంటున్నవ్. నీకు తెలివి ఉండొచ్చు. అబాద్దాలు మాట్లాడకు. నీకు తెలివి ఉందని హీందీ ఇంగ్లిష్ వచ్చని మాట్లాడుతున్నవ్. రెచ్చిపోతున్నవ్. డోంట్ యాక్ట్ ప్లే. నేను ఉస్మానియా యనివర్సిటీ తెలుగు శాఖలో పీహెచ్‌డీ స్కాలర్‌ను అని హెచ్చరించాడు. బ్రోకర్‌లా మాట్లాడుతున్నావ్ అంటూ తిట్ల దండకం అందుకున్నాడు. స్పందించిన క్రిశాంక్ నన్ను ఎందుకు బెదిరిస్తున్నావ్ అని ప్రశ్నించాడు. అల్లు ఆర్జున్‌ఇంటిపై దాడి చేసింది నువ్వా కాదా అని ప్రశ్నించాడు. దానికి శ్రీనివాస్ సమాధానం చెప్పకపోగా హిందీ, ఇంగ్లిష్ తెలుసు కానీ, తెలుగులోనే మాట్లాడు అంటూ మరోమారు బెదిరించాడు. దీంతో అర్నబ్ గోస్వామి జోక్యం చేసుకున్నారు. లైవ్ లింక్ పెడతా మాట్లాడాలని శ్రీనివాస్‌కు సూచించారు. దీంతో క్రిశాంక్ ఫోన్ కట్ చేశాడు.
మళ్లీ ఫోన్ చేసి..
గోస్వామి మాట వినకుండా శ్రీనివాస్.. కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. టీవీ లైవ్ డిబేట్‌లో ఉండగా మరోసారి ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో ఫోన్ కట్ చేశారు. అయినా అర్నాబ్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనడంతో బెదిరింపుల విషయం బయటపడింది. ఈ విషయం ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదాస్పదమైంది. అర్నాబ్ కూడా కాంగ్రెస్ తీరును తప్పు పట్టారు. లైవ్‌లో ఉండగా బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్
ఏకంగా నేషనల్ మీడియా ఛానల్ లైవ్ జరుగుతుండగా ఫోన్ చేసి బెదిరించిన అల్లు అర్జున్ ఇంటి మీద దాడి నిందితుడు
అల్లు అర్జున్ ఇంటి మీద దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్ వాస్తవ్యుడు రెడ్డి శ్రీనివాస్ రిపబ్లిక్ టీవీ ఛానల్లో లైవ్ చర్చ జరుగుతుండగా ఫోన్ చేసి మరీ… pic.twitter.com/ELcvOUNET0
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The video of ou leader threatening allu arjuns house has gone viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com