Ukraine War: ప్రపంచంలో అత్యంత కుభేరుడు ఎలాన్ మస్క్ అని అంతర్జాతీయ విషయాలపై అవగాహన ఉన్న ఎవ్వరిని అడిగినా టక్కున చెప్తారు. టెస్లా తెచ్చినప్పటి నుంచి ఆయన గుర్తింపు పెరుగుతూ పోయింది. ఒక్క టెస్లానే కాదు మస్క్ కు చాలా కంపెనీలు ఉన్నాయి. టెక్నాలజీని అడ్డుపెట్టుకొని దేశాలను కూడా శాసించేంత శక్తిని ఎలాన్ మస్క్ సంపాదించాడంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ‘నాసా’ స్పేస్ స్టేషన్ కు సునీతా విలియమ్స్, మరో వ్యక్తికి పంపించింది. అక్కడికి వెళ్లిన తర్వాత వారి స్పేస్ షిప్ కు ఇబ్బంది కలిగి తిరుగు ప్రయాణం ఇబ్బంది కరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమెను వారిని ‘స్పేస్ ఎక్స్’ మిషన్ లో తీసుకువస్తామని మస్క్ ప్రకటించండం ఆయన బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్పేస్ టూర్స్ ను ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఇది అందుబాటులోకి వస్తే స్పేస్ టూర్ మస్క్ కంపెనీల జాబితాలో చేరిపోతుంది. ఇదే కాదు.. ఇటీవల ట్విటర్ ను కూడా మస్క్ స్వాధీనం చేసుకున్నాడు. ట్విటర్ లో సగానికి పైగా షేర్లు ఉన్న మస్క్ వివాదాలు తలెత్తడంతో మొత్తంగా కొనుగోలు చేసి దానికి ‘ఎక్స్’ అని పేరు పెట్టారు. దీంతో పాటు నెట్ వర్కింగ్ రంగంలోకి కూడా వచ్చాడు. అదే ‘స్టార్ లింక్’ ఇది శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందకు పైగా దేశాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి.
మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ 2019 నుంచి ఉపగ్రహాలను ప్రయోగించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 7000 కంటే ఎక్కువ ఉప గ్రహాలను తక్కువ భూమి కక్ష (లోయర్ ఎర్త్ ఆర్బిటాల్)లోకి ప్రవేశపెట్టింది. మెల్ల మెల్లగా వీటి సంఖ్యను 34000కు పైగా పెంచనుంది. ఇలా ప్రవేశ పెట్టిన ఉప గ్రహాలు ఇంటర్ నెట్, డేటా ట్రాన్స్ ఫార్మర్ కోసం ఉపయోగపడతాయి.
భారత్ స్ర్ట్పెక్టమ్ వేలం విషయంలో అంబానీపై ఎలాన్ మస్క్ కామెంట్లు చేశాడు. అంబానీనే స్ర్పెక్టమ్ వేలం వేయకుండా అడ్డుకుంటున్నారని, ఇది ఆమోదయోగ్యమైన చర్య కాదని చెప్పుకచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎలాగైనా మస్క్ భారత్ లో తమ నెట్ వర్క్ ను విస్తరించేందుకు ప్లాన్లు చేస్తున్నాడు. మస్క్ తలుచుకుంటే ఇండియాలో తన నెట్ వర్క్ ను విస్తరించడం చిటికెలో పని. ‘స్టార్ లింక్’ ఇండియాలోకి ప్రవేశస్తే ఎయిర్ టెల్, జియో లాంటి నెట్ వర్క్ లకు కష్టకాలం మొదలైనట్లే.. ఎందుకంటే స్టార్ లింక్ అనేది ఎక్కడ ఉన్నా ఫుల్ సిగ్నల్ తో ఉంటుంది. ఇది నేరుగా ఉప గ్రహాలతో కనెక్ట్ అవుతుంది.
దీని వలన నష్టాలు
ఇటీవల మణిపూర్ లో మిలిటెంట్ల వద్ద ఆర్మీకి కొన్ని పరికరాలు లభించాయి. అందులో ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించింది. అవే ‘స్టార్ లింక్’కు సంబంధించి యాంటినా, రూటర్. అంటే మిలిటెంట్లు ఒకరితో ఒకరు సంభాషించుకునేందుకు, డేటా ట్రాన్స్ ఫర్ కు స్టార్ లింక్ ను వాడుతున్నారని నిరూపితమైంది. అయితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. భారత్ స్టార్ లింక్ కు అనుమతి ఇవ్వలేదు. అంటే ఆ నెట్ వర్క్ కు సంబంధించిన మోడమ్స్, నెట్ వర్క్ కు సంబంధించినవి ఇక్కడ పని చేయవద్దు కానీ పని చేస్తున్నాయి. దీని వలన ఉపద్రవాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా గతంలో ఒక భారీ డ్రగ్స్ షిప్ పట్టుబడింది. అందులో దాదాపు 5000 టన్నులకు పైగా డ్రగ్స్ ఉన్నాయి. అయితే వాటిని సరఫరా చేసేందుకు సైతం స్టార్ లింక్ నెట్ వర్క్ ను వినియోగించుకున్నట్లు ఆధాలు లభ్యమయ్యాయి.
ఇంకా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా జలన్ స్కీ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మస్క్ తీసుకొని యుద్ధం గతిని తిప్పాడు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడం ప్రారంభించింది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మస్క్ స్టార్ లింక్ కు సంబంధించి పరికరాలను పంపించాడు. ఈ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్ స్కీ మారిటన్ జోన్ లో సముద్రం గుండా రష్యాపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని స్టార్ లింగ్ ద్వారా పదాది దళాలకు వివరించాడు. దీంతో మస్క్ వెంటనే స్టార్ లింక్ సేవలను నిలిపివేశాడు. అలా చేస్తే వార్ తీవ్రత పెరుగుతుందని మస్క్ అనుకున్నాడు కాబట్టి నిలిపివేవాడు. దీంతో జలన్ స్కీ యుద్ధం చేయలేకపోయాడు. అంటే దేశాధ్యక్షుడు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మస్క్ తీసుకోవడం స్టార్ లింక్ గురించి ఆలోచించాల్సిన విషయమే.
ఇలా ఒక దేశ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని కూడా మార్చగలిగేంత శక్తి మస్క్ కు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ లింక్ గురించి పెద్ద చరిత్రే బయటకు వస్తుంది. టెక్నాలజీ రావడం, మారడం తప్పేమీ కాదు.. కానీ దాని నియంత్రణ ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం చేతిలో ఉండాలి. శాస్త్రవేత్తలు అనుబాంబు తయారు చేశారు. అలా అని వారి చేతుల్లోకి వెళ్తే ఎలా..? ప్రభుత్వం నడిపే పెద్దల చేతిలో, వారిని ఎన్నుకునే ప్రజల చేతుల్లో నిర్ణయాలు ఉండాలి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What is star link did ukraine play a key role in the war
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com