Ramoji Rao Passed Away: రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి సీఎస్ శాంతి కుమారికి సూచించారు. దీంతో ఆమె ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఆదివారం అంతిమ సంస్కారాలు..
ఇక రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖుల నివాళులు..
ఇదిలా ఉండగా రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించేందకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకుంటున్నారు. రామోజీ పార్థీవ దేహం వద్ద నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఏపీ మాజీ మంత్రి పరిటా సునీత, సినీ ప్రముఖులు రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్, ఫైల్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు నివాళులర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి రాజేంద్రప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.