కరోనా: ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి మూడినట్టే?

బతికుండగానే కరోనా రోగులను పీక్కుతిన్నాయి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులు.. ఏకంగా ఒక రోగి నుంచి 32 లక్షలు వసూలు చేసిన ఉదంతాలు కళ్లముందు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు ఎన్ని చీవాట్లు పెట్టిన కేసీఆర్ సర్కార్ ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు. అప్పట్లో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఆ టాస్క్ ఫోర్స్ నివేదిక రెడీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ కళ్లకు కట్టేలా నివేదిక సిద్ధం చేశాయి. […]

Written By: NARESH, Updated On : September 23, 2020 12:34 pm

private hospita

Follow us on


బతికుండగానే కరోనా రోగులను పీక్కుతిన్నాయి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులు.. ఏకంగా ఒక రోగి నుంచి 32 లక్షలు వసూలు చేసిన ఉదంతాలు కళ్లముందు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు ఎన్ని చీవాట్లు పెట్టిన కేసీఆర్ సర్కార్ ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు. అప్పట్లో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఆ టాస్క్ ఫోర్స్ నివేదిక రెడీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ కళ్లకు కట్టేలా నివేదిక సిద్ధం చేశాయి.

Also Read: ఓవర్‌‌ టూ దుబ్బాక : అటు హామీలు.. ఇటు ప్రారంభోత్సవాలు..

తెలంగాణ ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ ల బృందం రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్యలతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం ఈ మేరకు దర్యాప్తు చేసి నిగ్గు తేల్చింది.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన కరోనా చికిత్స ఫీజులకు 15 రెట్లు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రులు ముక్కుపిండి మరీ వసూలు చేసిన దారుణం కళ్లకు గట్టింది.  కరోనా పేరుతో కాసులు కురిపించుకున్నారని నిర్ధారించింది. అమాయకపు రోగులను మించి ‘ప్రైవేటు’దోపిడీ విశృంఖంగా సాగిందని నివేదిక ఇచ్చింది. కరోనా మహమ్మారి  భయాన్ని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ క్యాష్ చేసుకున్నాయని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ నిగ్గుతేల్చింది.ఫిర్యాదులు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసి, అధ్యయనం చేసింది. అక్రమాలపై నిగ్గు తేల్చారు. 15 రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా.. అంటువ్యాధుల చట్టాన్ని అతిక్రమించినట్లు టాస్క్ ఫోర్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేశాయని టాస్క్ ఫోర్స్ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఫీజుల పేరుతో లక్షల రూపాయలు గుంజినట్లు సమాచారం.ఈ మేరకు నివేదికను టాస్క్ ఫోర్స్ నేడో, రేపో ప్రభుత్వానికి అందజేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

Also Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?

దీంతో అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయినట్టు సమాచారం. అటు హైకోర్టు..ఇటు ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.