Hyderabad Real Estate: ప్రస్తుతం రియల్ వ్యాపారం కుదేలవుతోంది. భారీగా పెరిగిన ధరలతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో రియల్ రంగం నష్టాల బాటలోనే ప్రయాణిస్తోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రియల్ ఎస్టేట్ ఎంతో ఉన్నతంగా ఉన్నా రాష్ట్ర ఆవిర్భావంతో ముందుకు కదలడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చుక్కలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కట్టిన ఇళ్లన్నీ అలాగే మిగిలిపోతున్నాయి. వాటిని కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.

దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. నిర్మాణాల్లో కూడా వేగంగా పెరుగుతున్నాయి. కానీ వాటికనుగుణంగా కొనుగోళ్లు మాత్రం సాగడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం నష్టాలను మూటగట్టుకుంటోంది. నగరంలో దాదాపు 90 వేల యూనిట్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. ఇవి అమ్ముడుపోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలున్నాయి. దీంతో రియల్ వ్యాపారులు నిర్మాణాలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
Also Read: Munugode Bypoll- TRS Candidate: మునుగోడు అభ్యర్థి ఖరారు.. కేసీఆర్ ఇంత కసరత్తు వెనుక కారణం ఇదే?
ధరలు పెరగడంతో వ్యాపారం నష్టాల బాటలో ప్రయాణిస్తోంది. రియాల్టీ సంస్థలు దివాలా తీయడంతో రియల్టర్లు కోలుకోలేకపోతున్నారు. దీంతో అమ్మకాలు జరగడం లేదు. రియల్ రంగం కార్యకలాపాలు మందగించడంతో అమ్మకాల్లో వేగం తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రియల్ వ్యాపారులకు పాలుపోవడం లేదు. నగరంలో ఉన్న ఇళ్లన్ని అమ్ముడుపోవడానికి ఇంకా 41 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇక నిర్మాణాలు చేపడితే వాటి విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా సర్దుబాటు కాదనే ఉద్దేశంతో రియల్టర్లు ముందుకు రావడం లేదు. మొత్తానికి రియల్ రంగం ఇలా నష్టాల బాటలో ఉండటంతో ఇక నిర్మాణాల్లో వేగం తగ్గనుంది.

రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఇబ్బందులకు గురికావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అన్ని రంగాలపై దీని ప్రభావం పడనుంది. గతంలో లాభాల బాటలో పయనించిన రియల్ రంగం ప్రస్తుతం నష్టాలనే మూటగట్టుకుంటోంది. దీంతో అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. ఎక్కడ కట్టిన ఇళ్లు అక్కడే ఉంటున్నాయి. గతంలో అటు కడుతుండగానే ఇటు అమ్ముడుపోయే ఇళ్లు ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ మళ్లీ కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.
Also Read: KCR BRS- Jagan And Chandrababu: కేసీఆర్ కొత్త పార్టీతో అలెర్ట్… జగన్, చంద్రబాబులు కీలక నిర్ణయం?