YCP- Non Political JAC: మూడు రాజధానులకు మద్దతు కూడగట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుందా? పాలన వికేంద్రీకరణతో ఐక్య కార్యాచరణ సమితి పురుడు పోసుకోనుందా? దానిని నాన్ పొలిటికల్ జేఏసీగా నామకరణం జరగనుందా? తెరవెనుక నుంచి వైసీపీ సర్కారు అన్నివిధాలా ప్రోత్సాహం అందించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు దగ్గరగా ఉన్నాయి. వైసీపీ కీలక నేత తాజా వ్యాఖ్యాలతో నిజమని తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతికి మద్దతుగా రైతులు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకూ పాదయాత్ర చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో యాత్ర దిగ్విజయంగా ముగిసింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి యాత్రకు విశేషస్పందన లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా అమరావతి పోరాటానికి మద్దతు తెలుపుతోంది. జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. ఒక్క వైసీపీ మాత్రం పాదయాత్రను వ్యతిరేకిస్తోంది. అందుకే వైసీపీ మంత్రులు, నాయకులు ప్రతిరోజూ పాదయాత్రపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నోటి నుంచి నాన్ పొలిటికల్ జేఏసీ మాట ఒకటి వినిపించింది. త్వరలో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఒకటి ఫామ్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు మహా పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతుండడం, అటు కోర్టులో సైతం సవాల్ చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రాజకీయాలతో సంబంధం లేని ఒక జాయింట్ యాక్షన్ కమిటిని ముందుంచాలాని భావిస్తోంది.
Also Read: Munugode Bypoll- TRS Candidate: మునుగోడు అభ్యర్థి ఖరారు.. కేసీఆర్ ఇంత కసరత్తు వెనుక కారణం ఇదే?
అన్నిరకాల వనరులను సమకూర్చాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మేథావులు, వివిధ రంగాల ప్రముఖులతో ఆవిర్భవించే జేఏసీకి వైసీపీతో పాటు ఇతర రాజకీయ పక్షాలుమద్దతు తెలిపేలా ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ గానే నాన్ పొలిటికల్ జేఏసీని తెరపైకి తెస్తున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమరావతి ఏకైక రాజధాని నినాదంతో టీడీపీ ముందుకెళుతోంది. వైసీపీ మాత్రం పాలనా వికేంద్రీకరణకు, మూడు రాజధానులు అవసరమని..మూడు ప్రాంతాల అభివృద్ధే తమ అభిమతంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే స్లోగన్ తో ముందుకు సాగాలని భావిస్తున్నారు. అందుకే నాన్ పొలిటికల్ జేఏసీని ముందు పెట్టి ప్రజల్లోకి సెంటిమెంట్ ను బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే నాన్ పాలిటికల్ జేఏసీ మాత్రం పురుడు పోసుకుంటే పరిణామాలు శరవేగంగా మారే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.
Also Read:Prashant Kishor: జనంలోకి పీకే.. పాత మిత్రుల ఎదురుదాడి
[…] […]