KCR Health: మాజీ సీఎం కేసీఆర్ కు తుంటి ఎముక విరిగింది కదా? శస్త్ర చికిత్స చేసిన తర్వాత ఆరు నుంచి ఏడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు కదా.. మరి ఇప్పుడేంటి కేసీఆర్ ను వైద్యులు వెంట వెంటనే నడిపిస్తున్నారు.. దానికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.. వైద్యులు అన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి కేసీఆర్ ను వెంటనే ఎందుకు నడిపిస్తున్నట్టు? అలా నడిపిస్తే ఆయన కాలుకి ఎటువంటి ప్రమాదం ఉండదా? అసలు నిజంగానే శస్త్ర చికిత్స జరిగిందా? ఇలాంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.. ఇక సోషల్ మీడియాలో అయితే చర్చోప చర్చలు జరుగుతున్నాయి. కెసిఆర్ కు పాజిటివ్ గా భారత రాష్ట్ర సమితి నాయకులు వాదిస్తుంటే.. కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు మరో విధంగా స్పందిస్తున్నారు.. అయితే దీనిపై కొంతమంది వైద్యులను సంప్రదిస్తే వారు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
విరగడం సహజం
కొంత వయసు వచ్చిన తర్వాత అంటే 60 ఏళ్లు దాటిన తర్వాత ఎముకల్లో సాంద్రత తగ్గిపోతుంది. తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు, జన్యుపరమైన నేపథ్యం, కుటుంబ సభ్యులు నేపథ్యం.. చాలా కారణాలు ఎముకల సాంద్రతను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ప్రమాదవశాత్తు జారిపడితే లేదా నడక అపసవ్య దిశలో సాగితే ఆ ఒత్తిడి ఎముకల మీద పడుతుంది. ఎముక సాంద్రత తక్కువ ఉన్నచోట విరుగుతుంది. కెసిఆర్ కు కూడా జరిగింది ఇలాంటిదే. ఎముక విరిగిన ఆధారంగా వైద్యులు శస్త్ర చికిత్స లేదా వైద్య చికిత్స అందిస్తారు. ఇలాంటప్పుడు సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంటారు. ఎందుకంటే ఎముక కాస్త కదిలిన కూడా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆ సమయంలో అంతర్గత రక్తస్రావమైన కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు శస్త్ర చికిత్స చేసినా ఉపయోగం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
కెసిఆర్ కు జరిగింది ఇది
కెసిఆర్ కు తుంటి ఎముక విరిగింది. మనిషి నడకను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన విభాగం ఇది. ఇప్పుడు కేసీఆర్ కు 60 ఏళ్ల పైచిలుకు వయసు ఉంది. ఈ వయసులో సహజంగానే ఎముక సాంద్రత తగ్గుతుంది. అలాంటప్పుడు తుంటి ఎముక విరిగిన చోట యశోద ఆసుపత్రి వైద్యులు చికిత్స చేశారు. వాస్తవానికి ఇంకే శస్త్ర చికిత్సలో ఆయన 24 గంటల్లో నడిపించడం కుదరదు. కానీ కాలు జాయింట్ లేదా ఇతర జాయింట్ శస్త్ర చికిత్సల్లో.. శస్త్ర చికిత్స జరిగిన మరుసటి రోజు నుంచే ఆ జాయింట్ కదిరించే ఎక్సర్ సైజులు, నడిపించడం వంటి ప్రక్రియలు చేపడతారు. లేదంటే ఫ్రాక్చర్ అయిన ఆయా జాయింట్లలో కాల్షియం ఉత్పత్తి అవుతుంది. వేసుకునే మందులు కూడా దాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు ఆ జాయింట్ కాల్షియంతో నిండిపోతుంది. ఇలా నిండిపోకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి.. ప్రస్తుతం కెసిఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు చేయిస్తున్నది ఇదే.