Telangana RTC : తెలంగాణ ఆర్టీసీ పేరు మారింది..!

తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq అనే ఎక్స్‌ ఖాతాలను ఫాలో కావాలని విన్నవించారు.

Written By: NARESH, Updated On : May 22, 2024 8:02 pm

TGSRTC

Follow us on

Telangana RTC : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో తెలగాణ స్టేట్‌(TS)ను తెలంగాణ(TG)గా మార్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ బస్సు పేరు మారింది. TSRTCని TGSRTCగా యాజమాన్యం మార్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరు మారు‍్ప చేసింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో టీఎస్‌ ఆర్టీసీ లోగోను టీజీఎస్‌ ఆర్టీసీగా మార్పు చేసి విడుదల చేస్తామని తెలిపారు.

ఎక్స్‌ లో పోస్టు చేసిన ఎండీ..
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు టీఎస్‌ ఆరీట్సీ పేరును టీజీఎస్‌ ఆర్టీసీగా మార్చడం జరిగిందని సంస్థ ఎండీ సజ్జనార్‌ తన ఎక్స్‌ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు పేర్లను కూడా తెలియజేశారు. ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchqగా సంస్థ మార్చిందని పేర్కొన్నారు. ప్రయాణీకులు, ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలతోపాటు ఏవైనా ఫిర్యాదులు ఉంటే మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq అనే ఎక్స్‌ ఖాతాలను ఫాలో కావాలని విన్నవించారు.

నిన్నటి వరకు టీఎస్‌ ఆర్టీసీగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్టీసీ ఏపీఎస్‌ ఆర్టీసీగా కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీని టీఎస్‌ ఆర్టీసీగా మార్చింది. తెలంగాణ స్టేట్‌ను (TS)గా పేర్కొనడంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా ఏపీఎస్‌ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా మార్చింది. తొమ్మిదిన్నరేళ్లపాటు టీఎస్‌ఆర్టీసీగానే కొనసాగింది. తాజాగా దానిని టీజీఎస్‌ ఆర్టీసీగా మార్చారు.