Nandamuri Hero : నా బొచ్చు కూడా పీకలేరు… ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నందమూరి హీరో ఘాటైన వార్నింగ్

మీరు సపోర్ట్ సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి. మా బో .. పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు మావయ్యని, బాలకృష్ణ బాబాయ్ ని ఎవరు ఏం చేయలేరు.

Written By: NARESH, Updated On : May 22, 2024 7:51 pm

nandamuri-chaitanya-krishna

Follow us on

Nandamuri Hero : నందమూరి చైతన్య కృష్ణ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చాడు చైతన్య కృష్ణ. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందమూరి ఫ్యామిలీలో వివాదానికి తెరలేపాడు. ఆ వివరాల్లోకి వెళితే .. నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడే చైతన్య కృష్ణ. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరో నట వారసుడు.

చైతన్య కృష్ణ 2003 లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. జగపతి హీరోగా వచ్చిన ‘ ధమ్ ‘ లో ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా కాలం ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత గత ఏడాది ‘ బ్రీత్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. అప్పట్లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బాగానే వైరల్ అయ్యాడు.

బ్రీత్ సినిమా రిలీజ్ టైం లో చైతన్య కృష్ణ పై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. ఈ చిత్రం జీరో కలెక్షన్స్ సాధించి డిజాస్టర్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. ఇక తాజాగా చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వైసీపీ ఫ్యాన్స్ కి కలిపి వార్నింగ్ ఇచ్చారు. ‘ జూనియర్ ఫ్యాన్స్ కు ఇదే నా వార్నింగ్ .. ముఖ్యంగా వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ.

మీరు సపోర్ట్ సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి. మా బో .. పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు మావయ్యని, బాలకృష్ణ బాబాయ్ ని ఎవరు ఏం చేయలేరు. నా సినిమా బ్రీత్ మూవీ రిలీజ్ టైం లో కూడా జూనియర్ ఫ్యాన్స్, వైసీపీ వాళ్ళు కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి అంటూ నందమూరి చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చాడు. ఈ పోస్ట్ పై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.