Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినా భారీ వర్షాలు నమోదు కవడం లేదు. ఎండలు తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ వాన కబురు చెప్పింది. రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మూడు రోజులు ఈ జిల్లాల్లో..
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు వానలువ ఇస్తారిస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ మొత్తం, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన విజయనగరం, శ్రీకాకుంళం వరకు విస్తరించనున్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి.
ఉపరితల ద్రోణి..
ఇక ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య ద్రోణి సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంఓ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో ఇలా..
బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రానున్న మూడు రోజులు కరీంనగర్, పెద్దపల్లి, జంయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.