Tatikonda Rajaiah: తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లో చేరడానికి లైన్ క్లియర్ అయింది. ఆయన చేరికకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరికంటే ముందే ఆయన బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. కానీ కాంగ్రెస్‌లో చేరిక మాత్రం ఆలస్యమైంది. స్థానిక నేతలు ఆయన చేరికను వ్యతిరేకించడమే ఇందుకు కారణం. వద్దు ముర్రో అని అధిష్టానానికి విన్నవించారు. కానీ, ఎట్టకేలకు ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది.
సీఎంతో భేటీ..
స్టేషన్ ఘన్‌పూర్ నేతలు రాజయ్య చేరికను వ్యతిరేకిస్తుండడంతో ఆయన నేరుగా కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డినే కలిసి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో రేవంత్‌ను కలిశారు. స్థానిక పరిస్థితిపై చర్చించారు. బీఆర్‌ఎస్ నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో రెండుసార్లు ఎమ్మెల్యేగా..
ఇక రాజయ్య తెలంగాణ వచ్చాక 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధిష్టానం అతనికి టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్న రాజయ్యను సంతృప్తి పర్చేందకు గత ప్రభుత్వం రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమించింది. కానీ, ఎన్నిల తర్వాత పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టారు.
వద్దు ముర్రో అంటున్నా..
అయితే రాజయ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ను అణచివేశారు. కార్యకర్తలపై కేసులు పెట్టించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌లోకి రాకను స్థానిక నేతలు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రాజయ్యను పార్టీలో చేర్చుకోవద్దని ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో కొన్ని రోజులు చేరిక వాయిదా పడింది.
వద్దన్నా వదలకుండా..
ఇక రాజయ్య మాత్రం బీఆర్‌ఎస్‌లో ఉండలేక.. కాంగ్రెస్‌లో చేకికకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్ అపాయింట్ మెంట్‌కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ నేతల ఒత్తిడితో సీఎం కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ, పట్టు వీడకుండా రాజయ్య ప్రయత్నాలు చేసి సీఎం రేవంత్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపైనే రాజయ్య ప్రధానంగా చర్చించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లోనే రాజయ్య కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.