Summer Holidays Extend: ఎండలు మండిపోతున్నాయి. మృగశిర కార్తె ఆగమనం చేసినా వర్షాల జాడ కనిపించడం లేదు. కనీసం వాతావరణం చల్లబడటం లేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పిల్లలు, వృద్ధులు భరించలేకపోతున్నారు. ఎండకు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం నుంచే కొర్రాయిలా ఎండ తెరుస్తోంది. దీంతో జనం బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈనెల 26 వరకు సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్ లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. ఈ నెల 20 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
గతంలో కరోనా సమయంలో కూడా పాఠశాలల నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఎండల కారణంగా పాఠశాలల నిర్వహణకు బ్రేక్ పడుతోంది. ఈ క్రమంలో పిల్లల చదువులు ఎలా సాగుతాయో తెలియడం లేదు. ఎండలు ఎప్పటికి తగ్గుముఖం పడతాయో అంతుచిక్కడం లేదు. దీంతోనే ప్రభుత్వం సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులు ఈనెల 26 వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. వాతావరణం అప్పటికి కూడా చల్లబడకపోతే ఇబ్బందులు వస్తాయి. కానీ సెలవులు పొడిగించడంతో ఎండ బారి నుంచి పిల్లలను రక్షించినట్లు అవుతోంది. ఎండలు ఎండాకాలంలో కంటే అధికంగా ఉండటం గమనార్హం.