Chiranjeevi Legacy : చిరంజీవి లెగసీని కంటిన్యూ చేయడం లో పోటీ పడుతున్న ఇద్దరు మెగా హీరోలు…

రంగస్థలం సినిమాకి ముందు వరకు రామ్ చరణ్ నటన పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. కానీ రంగస్థలం సినిమాలో అతను నటించిన నటన అత్యద్భుతమనే చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో అయితే ఆయన పోషించిన పాత్రకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి.

Written By: NARESH, Updated On : April 8, 2024 9:15 pm
Follow us on

Chiranjeevi Legacy : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. మిగతా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ ఒకేత్తు అయితే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు మరొక ఎత్తనే చెప్పాలి. ఈ ఫ్యామిలీలోనే నలుగురు స్టార్ హీరోలు ఉండటం విశేషం…అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో హీరోల మధ్యనే పోటీ పెరుగుతుంది.

ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇక పవన్ కళ్యాణ్ ని పక్కన పెడితే రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరు చిరంజీవి లెగసీని ముందుకు తీసుకెళ్తారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇక ఇద్దరు కూడా డాన్స్, ఫైట్స్,యాక్టింగ్ లో అదరగొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో భాగంగానే వీళ్ళిద్దరూ ప్రస్తుతం తమదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లను చాటుతున్నారు.

కాబట్టి వీళ్లలో ఎవరు చిరంజీవి లెగసీ ని ముందుకు తీసుకెళ్లగలరు. చిరంజీవి రేంజ్ లో మెగా ఫ్యామిలీ ని టాప్ లో నిలిపే స్టార్ హీరో ఎవరు అనే దానిమీదనే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ విషయం లో రామ్ చరణ్ మొదటి స్థానంలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్ తో పోల్చుకుంటే రామ్ చరణ్ నటనలో మరికాస్త వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

రంగస్థలం సినిమాకి ముందు వరకు రామ్ చరణ్ నటన పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. కానీ రంగస్థలం సినిమాలో అతను నటించిన నటన అత్యద్భుతమనే చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో అయితే ఆయన పోషించిన పాత్రకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇక మొత్తానికైతే మెగా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలి అంటే అది రామ్ చరణ్ తోనే సాధ్యం అవుతుందని చాలామంది సీనియర్ హీరోలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది…