HomeతెలంగాణRan Utsav 2024 : కొనసాగుతున్న రణ్ ఉత్సవ్.. ఇంతకీ ఏంటి ఈ ఉత్సవ్?

Ran Utsav 2024 : కొనసాగుతున్న రణ్ ఉత్సవ్.. ఇంతకీ ఏంటి ఈ ఉత్సవ్?

Ran Utsav 2024 : గ్రేట్ ఆఫ్ ది రాణ్‌ ఆఫ్ కచ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుజరాత్‌లో ఉన్న రాణ్ ఆఫ్ కచ్ ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూస్తే ఎవరైనా కూడా ఆహా అనాల్సిందే. అయితే ప్రతీ ఏడాది రాణ్‌‌ ఆఫ్ కచ్‌లో రణ్ ఉత్సవ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా రణ్ ఉత్సవ్‌ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ రణ్ ఉత్సవ్‌‌ను 2025 ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు. ఈ పండుగ చూస్తే రెండు కళ్లు సరిపోవు. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్కృతి, చేతి పనులు, వంటకాలు ఎవరిని అయిన కూడా మంత్రముగ్ధులను చేసేస్తుంది. ఇంతటి అద్భుతమైన ప్రాంతాన్ని అన్వేషించాలంటే ఈ రణ్ ఉత్సవ్ సరైన సమయం. తెల్ల ఉప్పు ఏడారి ఆకాశ అందాలను ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఏడారి మొత్తం తెల్లగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారిలో ఒకటి. అయితే ఈ రణ్ ఉత్సవ్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రణ్ ఉత్సవ్ అనేది గుజరాత్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే రంగుల వేడుక. ఈ రణ్ ఉత్సవ్‌ను డిసెంబర్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు. వాతావరణం ఈ సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో ఈ పండుగను నిర్వహిస్తారు. అయితే ఈ పండుగను గుజరాత్ టూరిజం కార్పొరేషన్ తెల్లటి ఉప్పు ఎడారి అయిన రాణ్ ఆఫ్ కచ్‌లో నిర్వహిస్తుంది. ఇక్కడి ప్రజలు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ప్రదేశం ముఖ్యంగా చంద్రుడి కాంతిలో అయితే ఎంతో అందంగా ప్రకాశిస్తుంబది. ఇక్కడస్థానిక కళాకారులు, సంగీతకారులు, ప్రదర్శకులు అందరూ ఒక చోట కలిసి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఈ రణ్ ఉత్సవ్‌కు విచ్చేయండని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈ రణ్ ఉత్సవ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ముఖ్యంగా గర్బా, దాండియా రాస్ వంటి జానపద నృత్యాలతో పాటు శాస్త్రీయ సంగీతం, తోలుబొమ్మ ప్రదర్శనలు ఉంటాయి. అలాగే సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఈ ఉత్సవ్‌లో వస్త్రాలు, కుండలు, ఆభరణాల వంటివి లభ్యమయ్యే క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌లు కూడా ఉంటాయి. అలాగే సాంప్రదాయ కచ్ వంటకాలు ఎక్కువగా ఉంటాయి. రకరకాల స్వీట్లు, పదార్థాలతో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సంగీత కచేరీలు, ఒంటె సవారీలు, పారాసైలింగ్, డర్ట్ బైకింగ్ వంటి థ్రిల్లింగ్ కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఇక్కడి విశాలమైన ఎడారి తెల్లగా ఉండి యాత్రికులను ఎంతో ఆకట్టుకుంటుంది. అలాగే వన్యప్రాణులు అంటే ఇష్టం ఉన్నవారు సమీపంలోని కచ్ అభయారణ్యంలోకి సఫారీకి వెళ్లవచ్చు. ఇక్కడ న్యూ ఇయర్ ఈవ్, వాలెంటైన్స్ డేస్ స్పెషల్, హోలీ వంటి పండుగలు చాలా సరదాగా ఉంటాయి. అలాగే బనారసీ చీరలు, కుండలు ఉంటాయి. అన్నింటి కంటే మించి రాణ్ ఆఫ్ కచ్‌లో రాత్రి నక్షత్రాల కింద నడిస్తే ఆ ఫీల్ వేరే.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version