https://oktelugu.com/

Coconut Shell Business : కొబ్బరి చిప్పతో వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. ఎలాగంటే?

ప్రస్తుత కాలంలో బొగ్గుకు మంచి డిమాండ్ ఉంది. ఈ బొగ్గు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కూడా జరగదు. అందుకే ఈ బొగ్గుకి మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి చిప్పలతో బొగ్గు వ్యాపారం చేసి.. విక్రయిస్తే మంచి లాభాలను ఆర్జిస్తారు. అయితే ఈ వ్యాపారం ఎలా చేయాలి? ఎంత బడ్జెట్ అవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 27, 2024 / 02:24 PM IST

    Coconut Shell Business

    Follow us on

    Coconut Shell Business : కొబ్బరి గురించి అందరికీ తెలిసిందే. కొబ్బరి నీటిని తాగినా, కొబ్బరిని తిన్నా, కొబ్బరి నూనెను వంటల్లో ఉపయోగించిన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో కొబ్బరికి మంచి డిమాండ్ కూడా ఉంది. తక్కువలో కొబ్బరి బొండాల షాప్‌ను పెట్టుకున్న చాలు.. లాభాలు బోలెడన్నీ వస్తాయి. కొబ్బరి నీరు, కొబ్బరితో నూనె చేసి లాభాలను పొందుతారు. అయితే ఎందుకు పనికి రాని కొబ్బరి చిప్పతో వ్యాపారం చేస్తే లక్షల్లో ఆదాయం పొందవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియక కొబ్బరి చిప్పలను వృథా చేస్తుంటారు.కొబ్బరి చిప్పతో చార్కోల్(బొగ్గు) తయారు చేసి వ్యాపారం చేస్తే.. నమ్మలేనంత ఆదాయం పొందవచ్చు. ప్రస్తుత కాలంలో బొగ్గుకు మంచి డిమాండ్ ఉంది. ఈ బొగ్గు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కూడా జరగదు. అందుకే ఈ బొగ్గుకి మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి చిప్పలతో బొగ్గు వ్యాపారం చేసి.. విక్రయిస్తే మంచి లాభాలను ఆర్జిస్తారు. అయితే ఈ వ్యాపారం ఎలా చేయాలి? ఎంత బడ్జెట్ అవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
    కొబ్బరి చిప్పల వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది వృథాగా పడేస్తుంటారు. కొబ్బరి పెంకులను ఉపయోగించి బొగ్గును తయారు చేయవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ వ్యాపారాన్ని తక్కువ బడ్జెట్‌తో కూడా ప్రారంభించవచ్చు. మీరు చిన్న ప్లేస్ తీసుకుని అందులో ఈ వ్యాపారం మొదలుపెట్టాలి. కొబ్బరి రైతుల నుంచి మీరు బొగ్గు పెంకులు కొనుగోలు చేసుకోవాలి. వీటిని బొగ్గు తయారు చేసే మిషన్‌లో వేసి కాల్చాలి. మిషన్‌లో కాల్చకపోయిన కూడా సాధారణంగా మంటపై వేసి బాగా కాల్చాలి. వీటిని బాగా కాల్చిన తర్వాత ఇవి బొగ్గు పెంకులుగా మారుతాయి. వీటిని ప్యాకింగ్ చేసి మీరు విక్రయించవచ్చు. పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు తీసుకుంటే మీకు బాగా లాభాలు వస్తాయి. ప్రస్తుతం ఈ బొగ్గు కేజీ రూ.50 నుంచి రూ.70 పలుకుతోంది. ఈ వ్యాపారానికి బాగా డిమాండ్ ఉంది. ఏ సీజన్‌లో అయిన కూడా మీరు ఈ బొగ్గును విక్రయించవచ్చు. ఈ బొగ్గు మిషన్ ధర కూడా రూ.50000 నుంచి కోట్లు వరకు ఉంటుంది. మీరు తక్కువ రేటు ఉన్నది తీసుకుంటో రోజుకి కొంత లిమిట్ వరకు మాత్రమే బొగ్గును తయారు చేయగలరు.
    ఈ బొగ్గు వ్యాపారం చేస్తే దాదాపుగా నెలకి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం వస్తుంది. మీ మెషీన్ పెద్దది అయితే ఇంకా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ డబ్బులు లేక కొనుగోలు చేయలేని వారికి ప్రభుత్వం నుంచి లోన్ సదుపాయం కూడా ఉంది. ముద్రా లోన్ పథకం ద్వారా లోన్ పొందవచ్చు. దాదాపుగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కావాల్సిన లైసెన్స్‌లు అన్ని కూడా పొందాలి. అప్పుడే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోగలరు. కొబ్బరి నుంచి వచ్చే ఈ బొగ్గుతో బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా అయితే ఫేస్‌ ప్యాక్‌లు, కాస్మోటిక్స్‌, సబ్బు, స్పేర్‌ పార్టులు, గ్యాస్‌ మాస్కుల తయారీకి కూడా బొగ్గును ఉపయోగిస్తారు. ఈ వ్యాపారం ప్రారంభిస్తే నష్టాలు కాకుండా కేవలం లాభాలు మాత్రమే ఉంటాయి.