https://oktelugu.com/

KCR: కేసీఆర్‌ అందుకే బయటకు రావడం లేదట.. సారు అంతేగా మరి!

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు వరదకు కకావికలం అయ్యాయి. ఏపీలో జగన్‌కు ప్రతిపక్ష హోదా లేకపోయినా.. జనం మధ్యలోకి వచ్చారు. వరద బాధితులను ఓదార్చారు. రూ.కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణలో ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌ దాటడం లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 5, 2024 / 03:38 PM IST
    KCR(1)

    KCR(1)

    Follow us on

    KCR: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకులతమయ్యాయి. వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా ఇంకా రెండు రాష్ట్రాలు పూర్తిగా కోలుకోలేదు. ఏపీతో సీఎం చంద్రబాబు నిత్యం వరద బాధితులను కలుస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ఇక ఏపీతో మాజీ సీఎం, వైసీనీ ఎల్పీ నేత జగన్‌ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ఓదార్చారు. రూ.కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణలో విపక్ష బీఆర్‌ఎస్‌ అధినేత కేపీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అమెరికాలో ఉన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు మాత్రం ముగ్గురు, నలుగురు పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని ఖమ్మం జిల్లాలో పర్యటించి వర్చారు. ఇప్పటి వరకు బాధితులకు పార్టీ తరఫున ఎలాంటి సాయం ప్రకటించలేదు. అమెరికాలో ఉన్న కేటీఆర్‌ మాత్రం ప్రభుత్వ వైఫల్యంతోనే వరదలని ట్విట్టర్‌లో పోస్టు పెడుతున్నారు. తెలంగాణలో వర్షాలతో మృతిచెందిన వారని 35 మంది జాబితానూ పోస్టు చేశారు. రెండుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ మాత్రం తెలంగాణ ప్రజలు ఏమైతే నాకేంటి అన్నట్లుగా నోరు మెదపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జైలు నుంచి వచ్చిన బిడ్డ కవితతో కలిసి ఫామ్‌హౌస్‌లో సబరాల్లో మునిగితేలుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వీడకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తోన్నా కేసీఆర్‌ మాత్రం తనకేం పట్టనట్లే ఉన్నారు.

    ఆ సమయం కోసం వెయిటింగ్‌..
    రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, కేసీఆర్‌ గ్రౌండ్‌ లోకి దిగేందుకు సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కవితకు బెయిల్‌ దక్కిన తర్వాత కేసీఆర్‌ ప్రజా క్షేత్రంలోకి వస్తారని ప్రచారం జరిగింది. కాని, కవితకు బెయిల్‌ లభించి వారం రోజులు అవుతున్నా.. ఆయన మాత్రం ఫామ్‌హౌస్‌ వీడి బయటకు రావడం లేదు. వినాయక చవితి ఉత్సవాలు ముగిసిన తర్వాతే కేసీఆర్‌ జనంలోకి వస్తారని అంటున్నారు. ఏ పని చేయాలన్నా ముహూర్తం చూసుకునే గులాబీ బాస్‌ ప్రస్తుతం మంచి రోజులు లేకనే బయటకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచి రోజులు రావాలంటే దసరా పండుగ పోవాలి. అప్పటి వరకు ఆయన బయటకు రాకపోవచ్చన వాదన కూడా వినిపిస్తోంది. కొందరేమో… కూతురును ఇబ్బంది పెట్టినవారిని రాబోయే రోజుల్లో ఎలా ఇరికించాలో కవితతో కలిసి వ్యూహరచన చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

    ప్రజల్లోకి వెళితే పరువు నిలబడాలని..
    బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నా… వాస్తవ పరిస్థితి అలా లేదు. ఈ విషయం గులాబీ నేతకు తెలుసు. అందుకే ఇప్పుడు జనంలోకి వచ్చినా ప్రయోజనం ఉండదన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరి బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న కేకేలాంటి వారు కూడా బీఆర్‌ఎస్‌ను వీడారు. కాంగ్రెస్‌కు కేసీఆర్‌ బలహీనతలు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బయటకు వస్తే ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుందో అన్న భయం కూడా కేసీఆర్‌కు ఉన్నట్లు తెలుస్తోంది.

    పార్టీ నిర్మాణంపై దృష్టి..
    ఇదిలా ఉంటే.. గులాబీ నేతలు తమిళనాడులో డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణం, ఆ పార్టీ బలం, బలహీనతలను తెలుసుకునేందుకు కేటీఆర్‌ సారధ్యంలో త్వరలోనే ఓ బృందం వెళ్లనుంది. ఆ స్టడీ టూర్‌ తర్వాత వీటిపై చర్చించి బీఆర్‌ఎస్‌ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన అనంతరం, గ్రౌండ్‌లోకి దిగుతారు అనే టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటివరకు పూర్తిగా రుణమాఫీ చేశామని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండడంంతో.. రైతు అంశాలే ఎజెండాగా కేసీఆర్‌ రాజకీయం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో రైతుబంధు స్థానంలో అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారు? ఎవరెవరికి ఇస్తారు..? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా గైడ్‌ లైన్స్‌ విడుదల చేయకపోవడంతో వీటిని అస్త్రాలుగా మలుచుకొని కాంగ్రెస్‌ సర్కార్‌పై కేసీఆర్‌ సమరభేరి మోగిస్తారని తెలుస్తోంది.