Travis Head : ట్రావిస్ హెడ్.. బంతి మీద ఇంత కసి ఏంట్రా బాబూ..మరీ ఇలా కొడుతుంటే బౌలర్లు ఏం కావాలి..

ఏం కొట్టుడది.. ఏం దంచుడది. బంతిమీద కోపం ఉన్నట్టు.. బౌలర్ తో గెట్టు పంచాయతీ ఉన్నట్టు.. ఆడుతోంది చివరి మ్యాచ్ అన్నట్టు.. కసి కొద్ది కొడితే బాల్ ఎక్కడో పడుతోంది.. బౌండరీ తాడు చిన్నబోతోంది. స్టాండ్స్ అనేది ప్రేక్షక పాత్రకు పరిమితమవుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 5, 2024 3:37 pm

Travis Head

Follow us on

Travis Head : స్కాట్లాండ్ వేదికగా ఆ జట్టుతో ఆస్ట్రేలియా 3 t20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి t20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఈడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ జట్టును మట్టి కల్పించింది. స్కాట్లాండ్ జట్టు విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని 9.4 లోనే మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. 25 బాల్స్ లో 12 ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టి ఏకంగా 80 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. హెడ్ కు మిచెల్ మార్ష్ కూడా తోడు కావడంతో స్కాట్లాండ్ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. హెడ్ – మార్ష్ దూకుడు వల్ల ఆస్ట్రేలియా పవర్ ప్లేలో ఏకంగా 113 రన్స్ చేసింది. ఇదే సమయంలో హెడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ క్రికెట్ లో హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ గా ఆవిర్భవించాడు. పవర్ ప్లే లో హెడ్ 22 బంతులు ఎదుర్కొని.. ఏకంగా 73 రన్స్ పిండుకున్నాడు.

పవర్ ప్లే విభాగంలో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్టులో హెడ్ 73(22) ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. పాల్ స్టిర్లింగ్ 67(25), కొలిన్ మన్రో 64(24) తర్వాత స్థానాలలో ఉన్నారు. వీరందరి లో హెడ్ మాత్రమే తక్కువ బంతుల్లో హైయెస్ట్ స్కోర్ చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లను పూర్తిస్థాయిలో ఆడి.. 9 వికెట్లు లాస్ అయి.. 154 రన్స్ కొట్టేసింది. కాట్లాంటి జట్టులో మున్సే 28 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో అబాట్ మూడు వికెట్లు చేజెక్కించుకున్నాడు. జేవియర్, జంపా రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. స్కాట్లాండ్ విధించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఇంకా 62 బాల్స్ మిగిలి ఉండగానే చేజ్ చేసింది. అంతేకాదు ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. టి20 క్రికెట్ లో 150+ రన్ టార్గెట్ ను 60 కి మించి బంతులు మిగిలి ఉండగానే చేదించింది. ఈ ఘనత ద్వారా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పక్కన నిలిచింది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో లక్నో జట్టుపై 166 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ జట్టు 62 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించింది.

స్కాట్లాండ్ పై ట్రావిస్ హెడ్ వీర విహారం చేశాడు. అయితే ఇలా దూకుడుగా బ్యాటింగ్ చేయడం అతడికి ఇదే తొలిసారి కాదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన హెడ్.. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు అదే ఒరవడి స్కాట్లాండ్ జట్టుపై కూడా కొనసాగిస్తున్నాడు.

&