Revanth Reddy And Chandrababu: రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి చేసిన గొప్ప పని అదే..

సమస్యల పరిష్కారానికి మీరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు, మంత్రుల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత చర్చలతో ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకక పోయినా.. చర్చలతో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు అన ఒక సంకేతాన్ని ఇచ్చారు. దిశగా కమిటీల ఏర్పాటుకు అడుగులు పడడమే ఒక విజయం గా చెప్పవచ్చు.

Written By: Raj Shekar, Updated On : July 7, 2024 4:05 pm

Revanth Reddy And Chandrababu

Follow us on

Revanth Reddy And Chandrababu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విభజన సమస్యల పరిష్కారానికి అడుగు ముందుకు వేశారు. దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న విభజన ఒప్పందాల అమలకు ముందు అడుగు వేశారు. తెలంగాణలోని ప్రజాభవన్ వేదికగా సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది.

రెండు కమిటీలు..
సమస్యల పరిష్కారానికి మీరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు, మంత్రుల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత చర్చలతో ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకక పోయినా.. చర్చలతో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు అన ఒక సంకేతాన్ని ఇచ్చారు. దిశగా కమిటీల ఏర్పాటుకు అడుగులు పడడమే ఒక విజయం గా చెప్పవచ్చు.

రాజకీయం చేస్తారని తెలిసినా..
మీరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పై విపక్షాలు రాజకీయం చేస్తాయని ఇద్దరు ముఖ్యమంత్రులు ముందే ఊహించారు. అయినప్పటికీ దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగు ముందుకు వేశారు. తద్వారా ముఖ్యమంత్రిగా తమ బాధ్యతను నిర్వర్తించారు.

గతంలో అవకాశం వచ్చినా..
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవులు అధికారంలో ఉన్నారు. ఈ సమయంలో ఐదేళ్లు చంద్రబాబు నాయుడు మరో 5 ఏళ్ళు జగన్మోహన్రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్ కు పని చేశారు. ఈ సమయంలో వారికి అనేకసార్లు చర్చించే అవకాశం వచ్చింది. ఈ సమయంలో విభజన సమస్యల పరిష్కారానికి ఎక్కడా చొరవ చూపలేదు. చర్చలతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలను కోర్టుల దాకా తీసుకెళ్లారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సుల్ని ఆపినా జగన్ అడగలేకపోయారు. ఈ పరిస్థితుల నుంచి రాజకీయాలతో పాటు… రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కూడా ముఖ్యమేనని ఇద్దరు ముఖ్యమంత్రులు ముందడుగు వేశారు. ఓ ప్రయత్నం జరిగింది.

ఇక నిర్మాణాత్మకంగా..
మీరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో సమస్యల పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడింది. నేపథ్యంలో రాబోయే రోజుల్లో జరిపే చర్చలు నిర్మాణాంతకంగా ఉంటాయని సంకేతం ఇచ్చారు. ఫలితాలు చర్చలపై ఆధారపడి ఉంటాయి. అవి కూడా ఫలితాలను ఇస్తాయని శనివారం (జూలై 6న) జరిగిన భేటీ ఆశలు రేపింది.