Venkatesh: అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండేది. సినిమాలా పరంగా ఎంత పోటీ ఉన్నా కూడా వ్యక్తులపరంగా వాళ్ళు మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటూ అందరూ కలిసి మెలిసి ఉండేవారట. తరచుగా కలుసుకుంటూ ఒకరి సినిమా విషయాలను మరొకరికి చెప్పుకుంటూ చాలా ఆనందంగా గడిపేవారట…కానీ ఇప్పుడున్న హీరోల పరిస్థితి అలాలేదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు వెంకటేష్ చేయాల్సిన సినిమాని చిరంజీవి అడగడంతో వెంకటేష్ తనకోసం వదిలిపెట్టాడట. మరి ఆ సినిమా ఏంటి అంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’…ఈ సినిమాని మొదట వెంకటేష్ చేద్దామనుకున్నాడట. అయితే ఈ సినిమాని తమిళం లో రజనీకాంత్ చేశాడు. ఇక సినిమా రీమేక్ రేట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి రామానాయుడు తీసుకొని ఆయన కొడుకు అయిన వెంకటేష్ తో చేయాలనుకున్నాడట. కానీ అప్పటికే చిరంజీవి రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందనే ఉద్దేశ్యం తో వెంకటేష్ ఈ సినిమాను లైట్ తీసుకున్నాడట.
ఇక రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న ప్రొడ్యూసర్స్ చిరంజీవి న ని హీరోగా పెట్టీ ఈ సినిమాను చేశారు. ఇక ఈ సినిమా అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి చిరంజీవి కి ఒక భారీ ఇండస్ట్రీ హిట్ ని కట్టబెట్టిందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమం లో వెంకటేష్ ఈ సినిమాను వదులుకోవడం తో చిరంజీవి ఈ సినిమా చేసి ఇండియాలోనే టాప్ మ్యాగజైన్ గా పేరు పొందిన ఫోబ్స్ మ్యాగజైన్ లో చిరంజీవి మీద ఒక పెద్ద ఆర్టికల్ కూడా రావడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రిసర్డ్ లను బ్రేక్ చేసి కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే వెంకటేష్ చేయాలనుకున్న ఘరానా మొగుడు సినిమాని వదులుకోవడం వల్ల చిరంజీవి ఈ సినిమాను చేసి ఒక సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా టాప్ హీరోగా మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకున్నాడు…