Game Changer: ప్రముఖ దర్శకుడు శంకర్,హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే మరోపక్క అభిమానులు ఈ సినిమా పై నిరాశగా కూడా ఉన్నారు.ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి మూడు ఏళ్ళు అవుతున్న ఈ సినిమా నుంచి ఒక పోస్టర్,ఒక సాంగ్ తప్ప మరి ఏ అప్ డేట్ కూడా బయటకు రాలేదు అని చెప్పచ్చు.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ వార్తల్లో వినిపిస్తుంది.గేమ్ చెంజర్ సినిమాలో హీరో రామ్ చరణ్ షూటింగ్ పూర్తి అయ్యింది అనే ఒక న్యూస్ ప్రస్తుతం వినిపిస్తుంది.ఇక మరొక వారం రోజులు షూటింగ్ తర్వాత సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుందని సమాచారం.
ఈ సినిమా మేకింగ్ యెంత ఆలస్యమైనా కూడా ఈ సినిమా కు శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తూ ఉండడటం,అలాగే రామ్ చరణ్(Ram charan) ద్విపాత్రాభినయం చేయడం,పొలిటికల్ లీడర్ గా కూడా రామ్ చరణ్ కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా ఆసక్తి నెలకొంది.గేమ్ చెంజర్ సినిమా లో హీరో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో పొలిటికల్ లీడర్ గా మరియు ప్రస్తుతం ఒక IAS ఆఫీసర్ గా కనిపించబోతున్నారట.
ఈ సినిమాలో రామ్ చరణ్ పేరు రామ్ నందన్ అని తెలియడంతో అభిమానులు IAS ఆఫీసర్ పాత్రకు ఈ పేరు బాగా సెట్ అయ్యిందని,చాల క్లాస్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.