TGSRTC: ఫ్రీ బస్‌ ఎఫెక్ట్‌.. ఆర్టీసీ సంచలన నిర్ణయం.. వాటితో ఉచితానికి చెక్‌.. ఏం ప్లాన్ చేసిందంటే?

ఉచిత ప్రయాణం ఎఫెక్ట్‌.. ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతోంది. ప్రభుత్వం రిఫండ్‌ చేస్తున్నా.. రోజువారీ ఆదాయం తగ్గుతోంది. ఇక ఉచితం కారణంగా.. అవసరం ఉన్నా లేకున్నా.. మహిళలు ప్రయాణిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 2, 2024 1:59 pm

TGSRTC

Follow us on

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలైంది. సామాన్యుడు సీఎం అయినట్లు.. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎం అయ్యాక.. ఢిల్లీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కలిపచారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని… తమిళనాడులో సీఎం స్టాలిన్‌ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేస్తున్నారు. తర్వాత కర్ణాటక, తెలంగాణలోనూ ఫ్రీ బస్‌ ప్రారంభించారు. త్వరలో ఏపీలో కూడా అమలు చేయబోతున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్‌ కల్పిస్తామని తెలిపారు. అయితే ఉచిత ప్రయాణం ఢిల్లీ, తమిళనాడులో సమర్థవంతంగానే అమలవుతోంది. కర్ణాటక, తెలంగాణలో మాత్రం రోడ్డు రవాణా సంస్థలను నష్టాల్లోకి నెడుతున్నాయి. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం రవాణా చార్జీలు 20 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. దీనిపై విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇక తెలంగాణ పరిస్థితి కూడా అలాగే ఉంది. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈమేరకు ప్రభుత్వం ఆర్టీసీకి రీఫండ్‌ చేయాలి. ఈమేరకు బడ్జెట్‌లో కూడా ఉచిత ప్రయాణానికి రూ.3,300 కోట్లు కేటాయించింది. అయితే బస్సుల రోజువారీ నిర్వహణకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సివస్తోంది. వాహనాల్లో డీజిల్, బస్సుల మరమ్మతు, స్పేర్‌ పార్ట్స్‌ కొనుగోలు కోసం కూడా డబ్బులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయం మార్గంపై ఆర్టీసీ దృష్టిపెట్టింది.

మినీ డీలక్స్‌ బస్సులు..
మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. దీంతో డబ్బు చెల్లించి టికెట్లు కొనేవారు సీటు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి యాజమాన్యం త్వరలో 300 సెమీడీలక్స్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వీటిలో ఎక్స్‌ప్రెస్‌ కంటే 5–6% ఎక్కువ, డీలక్స్‌ కంటే 4% తక్కువగా «చార్జీలు ఉంటాయి. ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే సీట్లూ ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఉచిత ప్రయాణం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే అమలుచేస్తోంది. దీంతో సెమీ డీలక్స్‌లో ఉచిత ప్రయాణం ఉండదు.

మహాలక్ష్మితో తగ్గిన ఆదాయం..
కొత్తగా కొనుగోలు చేసే ఈ సెమీ డీలక్స్‌ బస్సులను ఎక్స్‌ప్రెస్‌ రూట్లలో నడపనున్నారు. ఈమేరకు టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. మహిళల ఉచిత ప్రయాణం రద్దీ కారణంగా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించే యోచనలో ఉంది. ఈమేరకు 300 కొత్త సెమీ డీలక్స్‌ బస్సులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిసింది. మహాలక్ష్మి పథకం కారణంగా రోజువారీ ఆదాయం తగ్గడంతోనే ఈ నిర్ణయంతీసుకుంది. మరోవైపు లక్ష్యం. లక్ష పేరిట స్కీం అమలు చేస్తున్నా.. ఆమేరకు ఆదాయం రావడంలేదు. ప్రతీ డిపో ఆదాయం రోజుకు రూ.లక్ష ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ప్రయాణికుల్లో 80 శాతం మహిళలే ఉంటున్నారు. దీంతో ఆదాయం రావడంలేదు.

పట్టణాల్లో సెమీ డీలక్స్‌..
ఇక కొత్తగా వచ్చే సెమీ డీలక్స్‌ బస్సులను పట్టణాల్లో నడుపనున్నట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో అవసరం లేకున్నా.. మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. చిన్న చిన్న పనికి కూడా ఫ్రీబస్‌ ఉందని ఎక్కుతున్నారు. ఇక కొందరు మహిళలు బస్సుల్లో జడలు వేసుకోవడం, ఉల్లిపాయల పొట్టు తీయడం, బ్రెష్‌ చేసుకోవడం వంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సెమీ డీలక్స్‌ ఆలోచన చేసినట్లు తెలిసింది.