https://oktelugu.com/

TGSRTC: డీజిల్ బస్సులు ఉండవిక.. అంతా ఎలక్ట్రిక్.. ఆర్టీసీ ఏం చేస్తుందంటే

ఆర్టీసీని ఎలక్ట్రిక్ గా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు చేపడుతున్నారు. ఇప్పుడున్న అన్ని డీజిల్ బస్సులను కేంద్రానికి అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ బస్సులను పొందాలని దానికి తగ్గ వ్యయం..

Written By:
  • Mahi
  • , Updated On : December 26, 2024 / 01:10 PM IST

    TGSRTC

    Follow us on

    TGSRTC: డీజిల్ భారాన్ని తగ్గించుకోవాలని దీని కోసం ఎలక్ట్రిక్ వైపునకు వెళ్లాలని టీఎస్ ఆర్టీసీ ప్రణళికలు వేస్తోంది. డీజిల్ భారంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించాలని అనుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన మహాలక్ష్మితో బస్సులపై ఒత్తిడి పెరిగింది. ఎక్కువ మంది బస్సుల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో సరిపోయే బస్సులు ఉండడం లేదు. దీనికి తోడు బస్సులో ఎక్కువ మంది ప్రయాణం చేస్తుండడంతో ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ బస్సులతో ఈ సమస్యలకు చెక్ పెట్టచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. అయితే ఇది పెద్ద ప్రాజెక్టు కావడంతో రాష్ట్రంతో సహా కేంద్రం కూడా అనుమతించాలని అప్పుడే తమ కార్యాచరణ నెరవేరుతుందని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్న అన్ని డీజిల్ బస్సుల స్థానాల్లో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని సజ్జనార్ అనుకుంటున్నారు. వీటితో వ్యయం తగ్గడంతో పాటు సంస్థపై భారం కూడా తగ్గుతుందంటున్నారు. పైగా స్మార్ట్ బస్సులుగా మారి సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటాయని చెప్తున్నారు.

    2025 సంక్రాంతి నాటిని హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని నగరంలో 190 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. వీటికి అదనంగా 50 తెస్తే వాటి సంఖ్య 240కు చేరుతుంది. డిసెంబర్ లోనే తీసుకురావాలనుకున్నా సాధ్యం కాలేదు. కానీ జనవరిలో మాత్రం 50 రోడ్లపై పరుగులు తీస్తాయని చెప్తున్నారు. హయత్ నగర్ డిపో నుంచే మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులుగా అందుబాటులోకి రానున్నాయి.

    ఎలక్ట్రిక్‌ బస్సులను డిపోల్లోకి తీసుకువచ్చి వాటి సంఖ్య పెంచుతున్న టీఎస్ ఆర్టీసీ వాటిని నడిపే విషయంలో డ్రైవర్లకు శిక్షణ ఇస్తుంది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 6 నెలల్లో 300 బస్సులు తేవాలనే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. 2025, డిసెంబర్‌ నాటికి 1500 ఎలక్ర్టిక్‌ బస్సులు రోడ్లపైకి తెచ్చేలా ఆర్టీసీ ముందుకు వెళ్తుందని సంస్థ అధికారులు చెప్తున్నారు. ఈవీ పెరుగుతున్న క్రమంలో గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 25 డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తోంది.

    ఒక్క నగరంతోనే ఆపకుండా రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులను తేవాలని ఆర్టీసీ అనుకుంటుంది. దీని కోసం ‘రెట్రో ఫిట్ మెంట్ పాలసీ’ అమలు చేయాలని యోచిస్తోంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు రూ. 1.50 కోట్లు ఉండడంతో రెట్రో ఫిట్ మెంట్ పాలసీ కింద పాత బస్సులను కేంద్రానికి అప్పగించి వాటి స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని కోరనుంది. ఇలా చేస్తే సంస్థపై భారం తగ్గుతుందని భావిస్తోంది.