https://oktelugu.com/

Electoral Bonds: ఏపీలో వైసిపి.. తెలంగాణలో బిఆర్ఎస్.. ఆ విషయంలో టాప్ ప్లేస్!

రాజకీయ పార్టీలను నడపడం అంత ఈజీ కాదు. దానికి ఎన్నో లెక్కలు ఉంటాయి. ముఖ్యంగా ఆదాయం ఉంటేనే పార్టీలను నడపగలం. అయితే వ్యక్తుల నుంచి, ట్రస్టుల నుంచి విరాళాలు వచ్చి పడుతుంటాయి.

Written By:
  • Dharma
  • , Updated On : December 26, 2024 / 01:00 PM IST

    Electoral Bonds

    Follow us on

    Electoral Bonds: సాధారణంగా రాజకీయ పార్టీలకు విరాళాలు వస్తుంటాయి. ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో విరాళాలు లభిస్తుంటాయి. మన రాష్ట్రానికి సంబంధించి పార్టీలకు అందించే ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. 2023 -24 సంవత్సరానికి సంబంధించి తాజాగా లెక్కలు వచ్చాయి. ఏపీలో వైఎస్సార్సీపీకి ఎక్కువ విరాళాలు రాగా.. ఆ తరువాత స్థానంలో టిడిపి నిలిచింది. అయితే ఓవరాల్ గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఈ విషయంలో ముందంజలో ఉంది. జాతీయస్థాయిలో బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. రాజకీయ పార్టీలకు వ్యక్తులు,ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వస్తాయి.2023-24 సంవత్సరానికి సంబంధించిన సహకార నివేదికల ప్రకారం లెక్కలు బయటకు వచ్చాయి. అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాల వివరాలను స్వచ్ఛందంగా తెలియజేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి బిఆర్ఎస్ కు రూ.495.5 కోట్లు బాండ్ రూపంలో వచ్చాయి. వైసీపీకి రూ. 121.5 కోట్లు వచ్చాయి. టిడిపికి 100 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బిఆర్ఎస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.

    * నిబంధనలు పాటించాల్సిందే
    దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నిర్వహణకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆయా పార్టీలు కచ్చితంగా తమ ఆదాయ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ప్రకారం 20 రూపాయలు లోపు విరాళాలకు సంబంధించిన వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. మిగిలిన విరాళాల విషయంలో మాత్రం ఎలా వచ్చాయో తప్పకుండా చెప్పాలి. అయితే చాలావరకు పార్టీలు తమకు విరాళాలను అందజేసినవారి వివరాలను తెలపడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందించిన వారి వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఖర్చుల వివరాలు తెలపాల్సిన అనివార్య పరిస్థితి రాజకీయ పార్టీలపై ఏర్పడింది.

    * జాతీయ పార్టీలకు సైతం
    మరోవైపు జాతీయ పార్టీలకు సైతం భారీ స్థాయిలో బాండ్ల రూపంలో ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. 2023 -24 లో వ్యక్తులు,ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి మొత్తం రూ.2244 కోట్ల ఆదాయం సమకూరింది. కాంగ్రెస్ పార్టీకి రూ.288.9 కోట్లు. గతంతో పోలిస్తే బిజెపి ఆదాయం గణనీయంగా పెరిగింది. అయితే సాధారణంగా అధికార పార్టీకి రకరకాల అప్లిగేషన్స్ ఉంటాయి. అందుకే జాతీయస్థాయిలో బిజెపికి, తెలంగాణలో బీఆర్ఎస్ కు, ఏపీలో వైసీపీకి ఈ ఏడాది బాండ్ల రూపంలో ఆదాయం పెరిగింది.