Andhra Jyothy vs BRS: ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ ఆదివారం తన సంపాదకీయంలో ” తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా ” అనే శీర్షికన రాసిన సంపాదకీయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నాయకులను ఆయన ప్రశ్నిస్తూ రాసిన వ్యాసం వివాదానికి కారణమైంది.పైగా తన వ్యాసంలో గులాబీ నాయకులను ప్రత్యక్షంగానే ప్రస్తావిస్తూ రాధాకృష్ణ విమర్శించారు. ఈ విమర్శలు భారత రాష్ట్ర సమితి నాయకులకు నేరుగా తగలడంతో వారు రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం నుంచి భారత రాష్ట్ర సమితి నాయకులు ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యాన్ని నేరుగానే విమర్శిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులైతే ట్విట్టర్లో ఆంధ్రజ్యోతి పత్రికకు యాడ్స్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర పత్రిక ఇక్కడ ఎందుకు ఉండాలని విమర్శిస్తున్నారు.
Also Read: తెలంగాణలో రూ.4,215 కోట్ల స్కాం.. సంచలనం
ఇక ఇటీవల మహా కార్యాలయం పై దాడులు జరిగిన నేపథ్యంలో.. ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ భారత రాష్ట్ర సమితి నాయకులను విమర్శిస్తూ సంపాదకీయం రాసిన నేపథ్యంలో.. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం ఏబీఎన్ కార్యాలయం, ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట భద్రతను పెంచింది. పోలీసులను కూడా భారీగా మోహరించింది. దీంతో గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఏబీఎన్ కార్యాలయం, ఆంధ్రజ్యోతి కార్యాలయం లోకి ప్రవేశించి దాడులు చేసే అవకాశం ఉన్నదని ఇంటలిజెన్స్ రిపోర్టు రావడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇక గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి పత్రిక పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ పత్రిక యజమాని పై దారుణంగా మండిపడుతున్నారు. తెలంగాణలో తెలంగాణ పార్టీని లేకుండా చేసే కుట్రకు స్వీకారం చుట్టారని ఆరోపిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు..”వేమూరి రాధాకృష్ణ తెలంగాణ ప్రాంత ద్వేషి. ఆయన టిడిపికి అనుకూలంగా రాతలు రాస్తాడు. టిడిపికి అనుకూలంగా ఉంటాడు. అందువల్లే ఇలాంటి విషపు రాతలు రాస్తున్నాడు.. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఉండకూడదని ఆయన కంకణం కట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి సహకారంతో ఇలా అడ్డగోలుగా ప్రచారాలకు దిగుతున్నాడు. వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని” గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు.
Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓపెన్ చాలెంజ్.. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ పేరు మార్చుకుంటాడా?
కెసిఆర్ కుటుంబాన్ని విమర్శించిన నేపథ్యంలో రాధాకృష్ణపై నమస్తే తెలంగాణ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. కాకపోతే నేరుగా రాసే దమ్ము లేక.. ఎవరో కొంతమంది నాయకులు కేటీఆర్ ను ఉద్దేశించి లేఖ రాశారని. ఆ లేఖలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణ నుంచి బహిష్కరించాలని కోరినట్టు.. నమస్తే తెలంగాణ పేర్కొంది. లేఖ రాసిన వ్యక్తులు ఎవరు? ఎందుకు రాశారు? లేఖ రాసిన వ్యక్తులకు పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలకు నమస్తే తెలంగాణ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఓపెన్ గానే సవాల్ చేస్తే.. నమస్తే తెలంగాణకు ఆ ధైర్యం లేకుండా పోయింది.