Lok Sabha Elections 2024: తెలంగాణాలో కేసీఆర్‌ పని ఖతం.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ హవా.. షాకింగ్‌ సర్వే!

తెలంగాణ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 12 స్థానాల్లో కాంగ్రెస్‌వైపే ప్రజలు మొగ్గు చూపారని తెలిపింది. ఓట్లశాతం కాంగ్రెస్‌ పార్టీకి 46 శాతం వస్తాయని వెల్లడించింది.

Written By: Raj Shekar, Updated On : March 5, 2024 2:06 pm

Lok Sabha Elections 2024

Follow us on

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు మరో వారం పది రోజుల్లో షెడ్యూల్‌ రావడం ఖాయం. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల జోష్‌ను పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగించాలని కాంగ్రెస్‌ చూస్తోంది. సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. బీజేపీ కూడా పది స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఈమేరకు ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రీపోల్‌ సర్వేలు..
పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతుండగా సర్వే సంస్థలు ప్రీపోల్‌ సర్వేలతో హడావుడి చేస్తున్నాయి. గ్రౌండ్‌ లెవల్‌ ఎలా ఉందో తెలుసుకుని ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే టైమ్స్‌నౌ, ఇండియాటుడే లాంటి పెద్ద సంస్థలు కూడా ప్రీపోల్‌ సర్వే ఫలితాలు ప్రకటించాయి. తాజాగా ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీకి తక్కువ ఉన్నాయి అన్నఅంశంపై జోరుగా సర్వేలు చేస్తున్నాయి. తెలంగాణ ట్రాకర్‌ పోల్‌ సంస్థ మరో సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. ఈ సంస్థ 17లోక్‌సభ స్థానాలకు గాను 12 స్థానాల్లో సర్వే చేసినట్లు తెలిపింది.

కాంగ్రెస్‌కే ఆధిక్యం..
తెలంగాణ ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 12 స్థానాల్లో కాంగ్రెస్‌వైపే ప్రజలు మొగ్గు చూపారని తెలిపింది. ఓట్లశాతం కాంగ్రెస్‌ పార్టీకి 46 శాతం వస్తాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉండగా, 30 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఇక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితమవుతుందని తేల్చింది. గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచిన బీఆర్‌ఎస్‌కు ఈసారి కేవలం 22 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ తెలిపింది. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఈ సర్వే షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి.

ఓట్ల శాతం ఇలా..
ఇక కాంగ్రెస్‌ పార్టీకి సర్వేలో పురుషులు 42 శాతం, మహిళలు 50 శాతం మద్దతుగా నిలిచారు. బీజేపీకి పురుషులు 34 శాతం, మహిళలు 26 శాతం మద్దతుగా నిలిచారు. బీఆర్‌ఎస్‌కు పురుషులు 21 శాతం, మహిళలు 23 శాతం అనుకూలంగా ఉన్నట్లు తెలంగాణ ట్రాకర్‌ పోల్‌ సంస్థ తెలిపింది.

పీఎం అభ్యర్థిపై..
ఇక ప్రధాన మంత్రి ఎవరైతే బాగుంటుంది అన్న అంశంపై సర్వేలో 51 శాతం మంది రాహుల్‌గాంధీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. నరేంద్రమోదీకి కేవలం 38 శాతం మాత్రమే మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. కేసీఆర్‌ ప్రధాని కావాలని కేవలం 1 శాతం మాత్రమే కోరుకుంటున్నారు. 8 శాతం మంది ఎవరైనా ఓకే అని తెలిపారు.