Telangana : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి(February)లోనే 35 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు(Temprature), మార్చి మొదటి వారంలో 38 డిగ్రీలకు పెరిగాయి. తాజాగా 40 పలు జిల్లాలో 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. పర్తి వేసవి రాకుండానే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రెండు నెలలు ఇంకా ఎండలు ఎంత ఉంటాయో అని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ప్రజలను అలర్ట్ చేసింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడం అంటే, వాతావరణం తీవ్రంగా ఉండవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన.
Also Read : ఉన్న భూములు అమ్ము.. పథకాలకు ఖర్చు పెట్టు.. తెలంగాణలో ఇదే ఫార్ములా
కొన్ని ఉదాహరణలు ఇలా ఉండవచ్చు:
ఆదిలాబాద్: గతంలో ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలో 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 38–40 డిగ్రీల మధ్య ఉంటుంది, కానీ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండవచ్చు.
పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్..
పెరిగిన ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండ తీవ్రతతోపాటు వాహనాల కారణంగా వేడి మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని సూచించింది. వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Also Read : తెలంగాణ పరిస్థితి బాగాలేదు.. భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!