Cellphones Recovery: సెల్‌ఫోన్ల రికవరీతో తెలంగాణ తోపు.. దేశంలో రెండో స్థానం!

చోరీ అయిన, పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో గతేడాది ఏప్రిల్‌ 19 నుంచి ఈ ఏడాది మే వరకు తెలంగాణ పోలీసులు 30,049 ఫోన్లు రికవరీ చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేశారు.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 9:41 am

Cellphones Recovery

Follow us on

Cellphones Recovery: చోరీ అయినా.. లేదా పొరపాటున పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేయడంతో తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) పోర్టల్, లోకల్‌ ట్రాకింగ్‌ ద్వారా ఫోన్లను ట్రేస్‌ చేసి వాటనిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణను దేశంలో రెండో స్థానంలో నిలిపారు.

ఏడాదిలో 30 వేల ఫోన్ల రికవరీ..
చోరీ అయిన, పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో గతేడాది ఏప్రిల్‌ 19 నుంచి ఈ ఏడాది మే వరకు తెలంగాణ పోలీసులు 30,049 ఫోన్లు రికవరీ చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సీఈఐఆర్‌ యూనిట్లు..
సెల్‌ఫోన్ల రికవరీకి రాష్ట్ర పోలీస్‌ శాఖ 789 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఏర్పాటు చేసింది. గడిచిన 9 రోజుల్లోనే వీటి ద్వారా వెయ్యి ఫోన్లు రికవరీ చేశారు. ఇలా తెలంగాణ సెల్‌ఫోన్ల రికవరీలో దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలవగా, మొదటి స్థానాన్ని కర్ణాటక సొంతం చేసుకుంది. ఏడాదిలో 35,945 ఫోన్లు రికవరీ చేసింది. 7,387 సెల్‌ఫోన్ల రికవరీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది.