https://oktelugu.com/

MLC Kavitha: కవితపై చార్జిషీట్‌.. ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు!

చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును ప్రత్యేక కోర్టు రిజర్వు చేసింది. మే 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. కాగా, ఈ కేసులో కవితపై 8 వేల పేజీలతో ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 9:30 am
MLC Kavitha

MLC Kavitha

Follow us on

MLC Kavitha: డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మధ్యంతర చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ ముగిసింది.

తీర్పు రిజర్వు..
చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును ప్రత్యేక కోర్టు రిజర్వు చేసింది. మే 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. కాగా, ఈ కేసులో కవితపై 8 వేల పేజీలతో ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై చార్జిషీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందు ఉంచింది. కేసులో కవితతోపాటు ఆరుగురు నిందితులపై మోపిన అభియోగాలను కోర్టు విడివిడిగా పరిశీలిస్తోంది.

ప్రధాన నిందితుడు అతడే..
ఇండియా ఎ హెడ్‌ ఉద్యోగి అరవింద్‌ సింగ్‌ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. అభిషేక్‌ బోయినపల్లి ఇంటరాగేషన్‌లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్‌ స్టేట్‌మెంట్‌ కూడా వీరి పాత్రను బయట పెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్‌ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్‌ చాట్‌ మెస్సేజ్‌ ద్వారా కూడా వీరి పాత్రపై సాక్షాలు లభించాయి.

తీర్పుపై ఉత్కంఠ..
మే 29న కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ నెలకొంది. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. కవితకు బెయిల్‌కు మార్గం సుగమం అవుతుంది. అయితే ఈడీ దీనిని మధ్యంతర చార్జీషీట్‌గా పేర్కొనడంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది.. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది అనేది చూడాలి.