T Safe App : ఈరోజుల్లో అసలు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. పట్టపగలు కూడా అమ్మాయి ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. స్కూల్, కాలేజీ, ఉద్యోగం అని ఇలా బయటకు వెళ్లడం తప్పనిసరి. అయితే కొన్నిసార్లు తిరిగి ఇంటికి రావడం లేటు అవుతుంది. స్పెషల్ క్లాస్ లేదా ఏదో ఒక రీజన్ వల్ల ఆలస్యం అవుతుంది. దీంతో ఏదో ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకుంటాం. చుట్టూ ఎవరూ ఉండరు. మనం ఒక రూట్ చెబితే వాడు ఓ రూట్ నుంచి తీసుకెళ్తాడు. ఇలా ఎందుకు తీసుకు వెళ్తున్నావు అంటే షార్ట్‌కట్ అని అంటారు. ఇలాంటి సందర్భాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. ఆ సమయంలో ఎవరికి కాల్ చేసిన వెంటనే రాలేరు. ఆ రూట్ కూడా వాళ్లకి సరిగ్గా తెలియదు. ఇలా చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు. ఇలా ఎప్పుడైనా రాత్రిపూట క్యాబ్ ఏదైనా ఎక్కితే దిగేవరకు భయంగానే ఉంటుంది. మన గమ్యానికి సేఫ్‌గా చేరిన తర్వాతే నార్మల్ అవుతాం. అయితే ఇకపై ఎలాంటి భయాలు లేకుండా ఈ యాప్‌తో మీరు ఎక్కడికైనా సేఫ్‌గా వెళ్లవచ్చు. మరి ఆ యాప్ ఏంటి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మహిళలు బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి టీ సేఫ్ యాప్ పనిచేస్తుంది. దీనిని ట్రావెల్ సేఫ్ అని కూడా పిలుస్తారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నతర్వాత లాగిన్ చేయాలి. ఆ తర్వాత మానిటరింగ్, డయల్ 100 రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. డిస్‌ప్లేలో కనిపిస్తున్ మానిటరింగ్ క్లిక్ చేసి మన ఎక్కడికి వెళ్తున్నామో అడ్రస్, వాహనం వివరాలు ఇవ్వాలి. మరీ అత్యవసరం అయితే 100పై క్లిక్ చేయాలి. వెంటనే పోలీసులు అలర్ట్ అవుతారు. మీ లోకేషన్ వివరాలు దగ్గరలోని స్టేషన్‌కు వెళ్తాయి. వెంటనే పోలీసులు మీకు కాల్ చేస్తారు. వెంటనే స్పందించపోతే క్షణాల్లో మీ లోకేషన్‌కు వస్తారు. అయితే కేవలం టీ సేఫ్ యాప్ మాత్రమే కాకుండా వెబ్‌సైట్ కూడా ఉంది. మీరు ఎక్కడికి వెళ్లాలో ప్రయాణించే ముందు వివరాలను మానిటరింగ్ చేసి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీరు ఒంటరిగా సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు.
ప్రస్తుతం అందరూ కూడా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ఎవరో కొందరు ఇంకా కీ ప్యాడ్ ఫోన్ వాడుతున్నారు. అయితే యాప్, వెబ్‌సైట్ స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లకి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ కీ ప్యాడ్ మొబైల్ వాడేవాళ్లు ఎలా అప్లై చేసుకోవాలి. సురక్షితంగా ఎలా ప్రయాణించాలని అనుకుంటున్నారా? వీళ్లకు కూడా ఒక ఆప్షన్ ఉంది. మొబైల్‌లో 100కు డయల్ చేసి ఐవీఆర్‌తో 8 నంబర్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత వివరాలను చెబితే సెల్ టవర్ బట్టి లోకేషన్‌ను ట్రాక్ చేస్తారు. అయితే ఇలా రిక్వెస్ట్ నమోదు చేసుకున్న తర్వాత ప్రతి 15 నిమిషాలకు ఒక ఫోన్ లేదా సేఫ్ట్ మెసేజ్ వస్తుంది. వీటికి స్పందించాలి. లేకపోతే సురక్షితంగా లేమని పోలీసులు గుర్తించి లోకేషన్ ద్వారా ఉన్న చోటకు వస్తారు.