https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.. సోషల్ మీడియాలో దున్నేసింది.. బిగ్ బాస్ ను ఊపడానికి వచ్చిన విష్ణుప్రియ బ్యాక్ గ్రౌండ్ ఇదే…

ఇక బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ షో మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకొని 8 వ సీజన్ లోకి అడుగుపెట్టింది...

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2024 / 10:41 PM IST

    Bigg boss 8 Anchor Vishnupriya

    Follow us on

    Bigg Boss Telugu 8 ప్రస్తుతం బిగ్ బాస్ షోకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈరోజే ప్రారంభమైన బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ ను పరిచయం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే 12 వ కంటె స్టెంట్ గా విష్ణు ప్రియ ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదట షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ‘విష్ణు ప్రియ’ ఆ తర్వాత ఈటివీ ప్లస్ లో వచ్చిన పోవేపోరా సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆమె యాంకరింగ్ కి చాలా మంది తెలుగు యువత అభిమానులుగా మారిపోయారు. ఇక ఇప్పటికే ఆమె సెలబ్రిటీ హోదాని దక్కించుకోవడమే కాకుండా యూట్యూబ్ లో కూడా పలు రకాల సాంగ్స్ లో కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మైన స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పటికే ఆమె పలు షోలతో అలరించగా ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ షో లోకి కంటెస్టెంట్ గా రావడమే కాకుండా ఏకంగా టైటిల్ని కూడా గెలుచుకుంటాను అనే కాన్ఫిడెంట్ ను కూడా వ్యక్తం చేస్తున్నారు…ఇక షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఫైనల్ గా హీరోయిన్ గా ఇండస్ట్రీలో స్థిరపడాలని తను అనుకుంది.

    తను అనుకున్నట్టుగానే ఆమె పలు రకాల షోల్లో చేసి మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఇక వాళ్ల నాన్నది ప్రకాష్ జిల్లా అయినప్పటికి ఉద్యోగ రీత్యా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. విష్ణు ప్రియ కూడా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో డిగ్రీ పూర్తవ్వగానే షార్ట్ ఫిల్మ్ లో నటిస్తూ బిజి అయ్యారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ విషయం ఆమె అభిమానులను చాలా వరకు సంతోషపెడుతుందనే చెప్పాలి.

    ఆమె ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో కష్టాలు అయితే అనుభవించినట్టుగా గతంలో చాలా ఇంటర్వ్యూల్లో కూడా తెలియజేశారు. గతంలో ఫ్యామిలీ ఆమెకు సపోర్ట్ చేసినప్పటికీ ఇక్కడ ఇండస్ట్రీలో మాత్రం ఆమె చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పారు. ఇక తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగానని అందువల్లే తను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నానని కూడా చెప్పింది.

    మరి బిగ్ బాస్ షో ద్వారా ఆమె ఫ్యూచర్ మరింత బ్రైట్ గా సాగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈటీవీ వారు నిర్వహించే చాలా ఈవెంట్స్ లో కూడా ఆమె సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో కలిసి ఆమె చేసిన ‘పోవే పోరా’ షో అందరికీ బాగా నచ్చింది దాంతోనే ఆమె చాలా పాపులారిటీని కూడా సంపాదించుకుంది.