https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : అమ్మ నాన్న లేరు.. భార్య వదిలేసింది.. బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఏడుపు ఆపుకోలేరు!

చిన్నతనం లోనే తండ్రి చనిపోయాడు, తల్లికి క్యాన్సర్. ఆమెని కాపాడుకోవడం కోసం నాగ మణికంఠ ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కానీ 2019 వ సంవత్సరం లో తన తల్లిని కూడా కోల్పోయాడు. జీవితంలో ఒంటరివాడిగా మిగిలిపోయిన నాగ మణికంఠ

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 10:24 PM IST

    Bigg boss 8 ,Nagamanikantha

    Follow us on

    ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 8 ఎట్టకేలకు నేడు మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ కపుల్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేసారు. లాంచ్ ఎపిసోడ్ లోనే ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను అలరించేలాగా అనిపించాయి. హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ దాదాపుగా అందరూ ప్రేక్షకులకు సుపరిచితమే. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం సోషల్ మీడియా ని రెగ్యులర్ గా ఉపయోగించేవాళ్లకు తప్ప ఎవరికీ తెలియదు. అలాంటి కంటెస్టెంట్స్ లో ఒకరు నాగ మణికంఠ. ఈయన ఒక యూట్యూబర్. ఆసక్తికరమైన వీడియోలతో ప్రేక్షకులను అలరించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇతని గురించి ఎవరికీ తెలియని వారి కోసం ఒక ప్రత్యేక కథనం ఇప్పుడు మీకు అందించబోతున్నాము. ప్రతీ మనిషి హృదయాన్ని కదిలించి, ఏడిపించేలా ఇతని జీవితం ఉంటుంది.

    చిన్నతనం లోనే తండ్రి చనిపోయాడు, తల్లికి క్యాన్సర్. ఆమెని కాపాడుకోవడం కోసం నాగ మణికంఠ ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కానీ 2019 వ సంవత్సరం లో తన తల్లిని కూడా కోల్పోయాడు. జీవితంలో ఒంటరివాడిగా మిగిలిపోయిన నాగ మణికంఠ తనకి ఒక తోడు కోసం ఎంతో తపన పడ్డాడు. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి అతని జీవితంలోకి వచ్చింది. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఇద్దరు అమెరికా స్థిరపడ్డారు. ఒక పాపకి కూడా జన్మనిచ్చారు. కానీ నాగ మణికంఠ కి ఎలాంటి ఉద్యోగం లేకపోవడం తో అతని భార్య చాలా చులకనగా చూసేది. రోజు నాగ మణికంఠ ఖాళీగా ఉండడం పై గొడవలు పెట్టుకుంటూ ఉండేది. నువ్వు ఇలాగే ఉంటే ఇక్కడ ఉండొద్దు, ఇండియా కి వెళ్ళిపోమని చెప్పిందట. అలా ఇండియా కి వచ్చిన నాగ మణికంఠ ఎదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేవాడు. ఒంటరిగానే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకొని తనకి ఇష్టమైన సినీ రంగంలో అవకాశాల కోసం బాగా ప్రయత్నాలు చేసాడు. ఆ క్రమంలోనే ఆయనకి పలు సీరియల్స్ లో నటించే అవకాశం దక్కింది. ‘కస్తూరి’ సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. అలా చిన్నగా అవకాశాలు సంపాదించుకుంటూ యూట్యూబ్ లో ఒక ఛానల్ ని ప్రారంభించి జనాలకు మరింత చేరువ అయ్యాడు.

    అలా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ నేడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. చూసేందుకు ఎంతో చలాకీగా ఉన్న ఈ కుర్రాడు, అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టేంత అందగాడు కూడా. ఇతని స్టోరీ వింటుంటే కన్నీళ్లు వచ్చేస్తుంది కదూ?, మొదటి రోజే ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్న నాగ మణికంఠ రాబోయే రోజుల్లో బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడబోతున్నాడో చూడాలి. ఇతనికి జంటగా బేబీ ఫేమ్ సీత హౌస్ లోకి అడుగుపెట్టింది. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో, వీళ్ళు హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ తో కలిసి ఎలా ఆడుతారో?, వీళ్ళు జోడిగా ఇలాగే ఉంటారా?, మధ్యలో వీళ్ళ మధ్య కూడా గొడవలు జరుగుతాయా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.