NTV journalists: ఇటీవల తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎన్టీవీ (NTV) ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో మంత్రికి, ఓ మహిళా అధికారికి సన్నిహిత సంబంధం ఉందని.. అందువల్లే ఆమెకు నచ్చిన పోస్టింగ్ ఇప్పించారని.. ఇద్దరు కూడా పీకలలోతూ ప్రేమలో ఉన్నారని.. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఆ అధికారిని బదిలీ చేయించారని ఎన్ టీవీ తన కథనంలో పేర్కొంది.
వాస్తవానికి ఇలాంటి స్టోరీ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు సంబంధిత అధికారుల లేదా వ్యక్తుల వివరణ తీసుకోవాలి. ఒకవేళ ఇన్సైడ్ కోణంలో ఈ వార్తను ప్రసారం చేయాలి అనుకున్నప్పుడు.. సాధ్యమైనంతవరకు ఎటువంటి ఆధారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బహిర్గతం చేయకూడదు. కానీ ఎన్టీవీ ఎటువంటి వివరణ తీసుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా మంత్రిని టార్గెట్ చేసి.. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసింది. అంతేకాదు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసింది. ఈ కథనం తెలంగాణ మంత్రి వర్గంలో చర్చకు కారణమైంది. ఐఏఎస్ అధికారులు కూడా ఈ స్టోరీ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అంతేకాదు ఎటువంటి వివరణ లేకుండా ఎన్టీవీ ఇలా స్టోరీ పబ్లిష్ చేయడాన్ని తప్పు పట్టారు. ఇటువంటి విధానాలు సరికావని.. ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ఒక లేఖ కూడా రాశారు. తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో ఎన్టీవీ యాజమాన్యం ఆ కథనాన్ని తొలగించింది. అంతేకాదు, జరిగిన ఘటనకు క్షమాపణ కాకుండా చింతిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్టీవీ విడుదల చేసిన ఈ ప్రకటనను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత సానుకూలంగా తీసుకోలేదని తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులు కూడా ఎన్టీవీ ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ..
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు బుధవారం చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ ఇన్ ఫుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టును ఇంకా తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. వారిని బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారని తెలుస్తోంది. ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం సంచలనం కలిగించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం దర్యాప్తు సాగిస్తున్న నేపథ్యంలో .. అకస్మాత్తుగా దొంతు రమేష్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లడానికి ఆయన విమానాశ్రయానికి వెళ్ళగా.. పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను అరెస్ట్ చేశారు. అయితే వారిద్దరూ ఎక్కడ ఉన్నారు ఇంతవరకు తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారని తెలుస్తోంది.
NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంకా అరెస్ట్ చూపని పోలీసులు
ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం
మహిళా IAS మరియు మంత్రి వార్త వ్యవహారంలో NTV న్యూస్ ఛానల్ పై కఠినమైన చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
ఐదురోజుల… pic.twitter.com/lFyrKIiVtO
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026