Maratha Military Landscapes: ప్రపంచ వారసత్వ కట్టడాలకు గుర్తింపు ఇవ్వడానికి.. పర్యాటకంగా పేరు తీసుకురావడానికి యునెస్కో కొంతకాలంగా ప్రయత్నం చేస్. ఇందులో భాగంగానే ప్రపంచ వారసత్వ కట్టడాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయా దేశాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించి.. ఆ తర్వాత వాటిని ప్రపంచ వారసత్వ జాబితా కట్టడాలుగా ప్రకటిస్తోంది. తాజాగా మన దేశానికి చెందిన మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఇందులో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం పారిశ్రాంతంలో 47వ వరల్డ్ హెరిటేజ్ సెషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ కు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
యునెస్కో గుర్తింపు పొందిన 44వ ప్రదేశంగా మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ నిలిచింది. 2024 -25 సంవత్సరానికి సంబంధించి దీనిని ఎంట్రీగా తీసుకున్నట్టు యునెస్కో ప్రకటించింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరాఠాలకు సంబంధించిన 12 కోట్ల సముదాయాన్ని ఇటీవల యునెస్కోకు పంపించింది. ఈ చారిత్రాత్మకమైన కట్టడాల సముదాయాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని సూచించింది. కేంద్రం పంపించిన ప్రతిపాదనను పరిశీలనలోకి తీసుకున్న యునెస్కో.. మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ ను పరిశీలించింది. కేంద్రం చెప్పినట్టుగానే ఇందులో చారిత్రాత్మకమైన విషయాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ కోటలు మొత్తం తమిళనాడు, మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి. ఈ కోటలు మొత్తం 12 సముదాయాలుగా ఉన్నాయి.. మహారాష్ట్ర ప్రాంతంలోని సాల్హేర్, శివ్నరీ, లోహ్డ్, ఖండేరి, రాయగడ్, రాజ్ గడ్, ప్రతాప్డ్, సువర్ణ్ దుర్గ్, తమిళనాడులోని జింజికోట వంటివి మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ లో ఉన్నాయి.
Also Read: మంత్రి ఇంట్లో బ్యాగ్‌లో నోట్ల కట్టలు.. వీడియో లీక్
ఈ కోటలకు చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. 17 శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. 1737 నుంచి మొదలు పెడితే 1803 వరకు మరాఠాలు ఢిల్లీ సామ్రాజ్యాన్ని ప్రభావితం చేశారు. భారత చరిత్ర గమనంలో తమ వంతు పాత్ర పోషించారు. శివాజీ నాయకత్వంలో మరాఠాలు తిరుగులేని శక్తిగా ఆవిర్భవించారు. మరాఠాల సామ్రాజ్యం మొత్తం పర్వతప్రాంతాలు.. దట్టమైన అడుగులతో కూడి ఉండేది. గెరిల్లా యుద్ధాలు చేయడంలో మరాఠాలు ఆరి తేరి ఉండేవారు. యుద్ధంలో వారి ధైర్యం, నైపుణ్యం అద్భుతంగా ఉండేది. వారి రక్షణ సామర్ధ్యం కూడా తిరుగులేని స్థాయిలో ఉండేది. శివాజీ నాయకత్వంలో రాజకీయ ఐక్యత కూడా బలంగా ఉండేది. శివాజీ పరిపాలిస్తున్న కాలంలో మహారాష్ట్ర మొత్తం భక్తి ఉద్యమం ఉండేది. అక్కడ ప్రజల్లో మతపరమైన ఐక్యత భావాన్ని కొనసాగించింది. తుకారాం, రాందాస్, ఏక్ నాథ్ వంటి ఆధ్యాత్మిక ప్రవచన కారులు సామాజిక ఐక్యతను ప్రదర్శించారు. మరాఠా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న శివాజీ బీజాపూర్ సుల్తాన్ తో చేసిన ఉద్యమం చారిత్రాత్మకమైనది. ఆ యుద్ధం తర్వాత అతడు టోర్న వంటి కోటలను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హైందవి స్వరాజ్యాన్ని ప్రారంభించాడు.
రాయ్ గడ్ ప్రాంతాన్ని శివాజీ తన రాజధానిగా చేసుకున్నాడు. అంతేకాదు మొఘలుల రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఛత్రపతిగా 1674లో పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు. పట్టాభిషేకం తర్వాత శివాజీ తన యుద్ద రీతిని మొత్తం మార్చేశాడు. సైన్యాన్ని అనేక విభాగాలుగా మార్చేశాడు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరి విధంగా రూపొందించాడు. అందువల్లే శివాజీని మరాఠాలు తమ యోధుడిగా పిలుచుకుంటాయి. అతడి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాయి. తమ జాతి ఆణిముత్యంగా అతడిని భావిస్తుంటాయి. ఇప్పుడు మరాఠా కోటలకు యునెస్కో గుర్తింపు రావడంతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం కనిపిస్తోంది.