Homeటాప్ స్టోరీస్Telangana Municipal Elections Results: మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ ను హీరోను చేసింది అదే!

Telangana Municipal Elections Results: మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ ను హీరోను చేసింది అదే!

Telangana Municipal Elections Results: మనం ఇంట్లో అన్నం తింటున్నప్పుడు.. స్వేచ్ఛగా వ్యవహరించగలుగుతాం. ఎక్కడో ఒకచోట కూర్చుని ఆహారాన్ని లాగించేస్తూ ఉంటాం. అలాకాకుండా హోటల్లో తింటే ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తూ ఉంటాం. ప్రాంతం మారినప్పుడు.. తినే ఆహారం మారినప్పుడు ఆటోమేటిక్ గా మన వ్యవహర శైలిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది.

పై ఉపోద్ఘాతం రాజకీయాలకు కచ్చితంగా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు స్వేచ్ఛగా పనిచేసుకోగలుగుతాడు మంచి అనేది ఏదైనా జరిగితే తన ఖాతాలో వేసుకోగలుగుతాడు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంటాడు. తనే హై కమాండ్ కాబట్టి ఇంకొకరికి సమాధానం చెప్పకుండా.. అసలు సమాధానమే చెప్పాల్సిన అవసరం లేకుండా వ్యవహరిస్తూ ఉంటాడు.

కానీ ఒక జాతీయ పార్టీలో పనిచేసే వ్యక్తికి ఇలా ఉండదు. అతడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. తీసుకునే నిర్ణయాన్ని ముందుగానే వెల్లడించాలి. పార్టీకి ఇబ్బంది రాకుండా.. ప్రభుత్వానికి ఒత్తిడి ఎదురుకాకుండా చూసుకోవాలి. ప్రతికూలతలు ఎదురైనప్పుడు సమయమనం తో.. సానుకూలతలు వచ్చినప్పుడు ఆశావాహ దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించింది. ఏకపక్షమైన విజయాలు కాకుండా.. గట్టి పోటీ ఎదుర్కొని మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలను దక్కించుకున్నాయి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఫలితాలు అంతగా ఏకపక్షంగా లేవు. అదే ఒకవేళ ప్రాంతీయ పార్టీకి గనుక రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తే ఫలితాలు మొత్తం ఏకపక్షంగా ఉండేది. క్షేత్రస్థాయిలో అనేక ప్రతికూలతలను అధిగమించి 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. ఎన్నికల సభల్లో కూడా అన్ని తానై నడిచాడు. ఇప్పుడు ఫలితాల విషయం కూడా రేవంత్ రెడ్డి అనేక ప్రతికూలతలను అధిగమించాడు. తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ లేదా కేటీఆర్ గనక ఉండి ఉంటే ఫలితాలు ఏకపక్షంగా ఉండేవి. పైగా ఎన్నికల విషయంలో గులాబీ పార్టీ అడ్డగోలుగా వ్యవహరించేది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పై సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛాయుత విధానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అధికార పక్షానికి గౌరవం.. ప్రతిపక్షానికి తోడ్పాటు ప్రజల నుంచి లభించాయి. ఇదిగో ఇక్కడే రేవంత్ రెడ్డి గెలిచాడని.. అసలు సిసలైన నాయకుడిగా ఆవిర్భవించాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular