HomeతెలంగాణTelangana MP Controversy: బిజెపికి షాక్.. ఈటెల రాజేందర్ కొత్త పార్టీ..

Telangana MP Controversy: బిజెపికి షాక్.. ఈటెల రాజేందర్ కొత్త పార్టీ..

Telangana MP Controversy: పేరు ప్రస్తావించకుండా భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడి మీద తీవ్రస్థాయిలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఇంతకీ ఏ నాయకుడిని ఉద్దేశించి ఆయన ఆ మాటలు మాట్లాడారు? శాంతంగా ఉండే ఆయన ఎందుకు ఒక్కసారిగా ఈ స్థాయిలో స్పందించారు? నిదానంగా మాట్లాడే ఆయన ఎందుకు ఈ రేంజ్ లో మండిపడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానాలను రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చెబుతున్నారు. ఈ విశ్లేషణలు ఎలా ఉన్నా.. పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ పత్రిక పిడిఎఫ్ కేటగిరికి చెందింది. దీనికి ఉన్న విశ్వసనీత ఎంత అనే ప్రశ్నను పక్కన పెడితే.. ఈ పత్రిక లో రాసిన కొన్ని వాక్యాలు మాత్రం నిజంగానే ఈటెల రాజేందర్ రాజకీయ గమనాన్ని నిర్దేశించే విధంగా ఉన్నాయి.

Also Read: ఒక్క నిర్ణయం.. ఎంతోమంది హృదయాలు గెలిచిన రేవంత్

కమలం పార్టీ నుంచి బయటికి వెళ్లడానికి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు సిద్ధంగా ఉన్నారని.. ఇటీవల పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఆయన అధిరోహించాలని అనుకున్నారని.. చివరి నిమిషంలో అది తప్పిపోయిందని.. అందువల్లే తన రాజకీయ ప్రస్థానాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. కొత్త రాజకీయ వేదికన ఏర్పాటు చేసేందుకు ఈటెల వేగంగా అడుగులు వేస్తున్నారని.. ఆయన సన్నిహితులు బహుజన జనతా సమితి పేరుతో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేశారని ఆ పత్రిక వివరించింది. అందువల్లే ఆయన ప్రతి వార్డ్ మెంబర్ మనవాళ్లే అంటూ సందేశం ఇచ్చినట్టు తెలుస్తోందని ఆ పత్రిక రాసిన కథనంలో స్పష్టం చేసింది. పార్టీ పెట్టాలంటూ అభిమానులు తీసుకొస్తున్నారని.. అందువల్లే ఈటెల ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడారని ఆ పత్రిక విశ్లేషించింది..” లాభనష్టాలు.. సాధ్యా సాధ్యాలను పరిశీలించిన తర్వాత.. అందరిని కలుపుకొని పోయే విధంగా ప్రణాళిక రూపొందించి.. ఈటల పార్టీ పేరును ప్రకటిస్తారని” ఆ పత్రిక తన కథనంలో వెల్లడించింది..” భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి అన్ని వివరించిన తర్వాతే కీలక ప్రకటన చేస్తారు. కొత్త పార్టీ విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిజెపిలో రాష్ట్రస్థాయి నేతలు కొట్టుకుంటున్నారు. అందువల్లే ఈనెల చివరిలో తాడోపేడో తేల్చుకోవడానికి ఎంపీ వర్గం సిద్ధమైందని” ఆ పత్రిక తన కథనంలో వివరించింది.

Also Read: ప్రియుడి పై మోజు.. భర్తకు 15 నిద్ర మాత్రలు.. దిగ్భ్రాంతికర వాస్తవాలు!

వాస్తవానికి ఈటల రాజేందర్ ది పీడీఎస్ యూ నేపథ్యం. పైగా ఆయన వామపక్ష భావజాలం కలిగిన నాయకుడు. అందువల్లే ఆయన మాటలో సూటితనం కనిపిస్తుంది. భారత రాష్ట్ర సమితిలో కొనసాగినప్పుడు.. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు.. ఈటల రాజేందర్ నిక్కచ్చిగా వ్యవహరించేవారు. అందువల్లే ఆయన గులాబీ పార్టీకి ఓనర్లం అని వ్యాఖ్యానించారు. అదే ఆయనను ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లేలా చేసిందని సన్నిహితులు అంటుంటారు. నాడు తన రాజకీయ గమనానికి సంబంధించి అనివార్య పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లారని.. అంతే తప్ప పార్టీ సిద్ధాంతాలు నచ్చిన కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఏది ఏమైనప్పటికీ పార్టీ ఏర్పాటు చేయాలని.. రాజకీయ కార్య క్షేత్రాన్ని మార్చుకోవాలని ఈటెల అనుకుంటే.. అది తెలంగాణలో మరో పరిణామానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీని నడపడం అంత సులభం కాదని.. గతంలో పార్టీలు ఏర్పాటు చేసిన వారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో ఈటలకు తెలుసని.. అందువల్లే ఆయన కొత్త పార్టీ పెట్టే ధైర్యాన్ని చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular