HomeతెలంగాణTelangana Ministers Angered Over Pawan Kalyan: పవన్‌ సినిమాలు ఆడునివ్వం.. సారీ చెప్పాల్సిందే.. హెచ్చరించిన...

Telangana Ministers Angered Over Pawan Kalyan: పవన్‌ సినిమాలు ఆడునివ్వం.. సారీ చెప్పాల్సిందే.. హెచ్చరించిన తెలంగాణ మంత్రులు.. ముదిరిన వివాదం

Telangana Ministers Angered Over Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తెలంగాణలో మంటలు రేపుతున్నాయి. తెలంగాణ ప్రజల దిష్టి ఏపీలోని కోన సమీకు తగిలిందని అందుకే కొబ్బరి చెట్లు కాయలు కాయడం లేదని పవన్‌ వ్యాఖ్యానించారు. దీనిని మొదట లైట్‌గా తీసుకున్నారు. కానీ సోషల్‌ మీడియాలో పవన్‌ వ్యాఖ్యలు వైరల కావడంతో అధికారం కాంగ్రెస్‌ నేతలు, విపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు స్పందిస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్నేహపూర్వకంగా విడిపోయిన రాష్ట్రాల మధ్య ఇప్పుడు పవన్‌ వ్యాఖ్యలు మంటలు చేపుతున్నాయి.

తెలంగాణ మంత్రుల ఆగ్రహం..
తాజాగా పవన్‌ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చప్పాల్సిందే అని సినమా అటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే పవన్‌ సినిమాలను తెలంగాణలో ఆడకుండా చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఒకసారి క్షమాపణ చెప్పితే ఒకటో రెండో రోజులు ఆడతాయని అంటున్నారు లేదంటే బ్యాన్‌ తప్పదని హెచ్చరించారు.

పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై తెలంగాణలో ఆగ్రహం..
పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు రెండు ప్రాంతాల మధ్య సర్వసాధారణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని మరో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ తరహా మాటలు ఆ ప్రభుత్వాలకు మధ్య శాంతియుత సంబంధాలను దెబ్బతీయాలని భావిస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు క్షమాపణ కోరుతున్నారని తెలిపారు.

క్షమాపణ డిమాండ్‌..
తెలంగాణలో రాజకీయ నేతలు, ముఖ్యంగా కోమటిరెడ్డి వంటి నాయకులు పవన్‌ కళ్యాణ్‌ నుండి తక్షణ క్షమాపణ కోరుతున్నారు. ఇది లేకపోతే సినిమాలు ఆడకపోవచ్చు, జనసేన పార్టీ మీద కూడా ప్రభావం పడవచ్చని సూచిస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలు రాజకీయ ప్రసంగాలలో ఉన్న జనసేనపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చర్చ. రాజకీయ వర్గాల సమన్వయం లేకపోతే ప్రజల మధ్య సహజ శాంతి బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ భవితవ్యం, సినిమాల దృష్ట్యా క్షమాపణ చెప్పడమే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular