Mana Shankar Varaprasad Garu 2nd Song: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad Garu) చిత్రం జనవరి 12 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టేసారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘మీసాలపిల్ల’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఒక్క యూట్యూబ్ లోనే ఈ పాటకు 73 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మిగిలిన మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి భీమ్స్ ఎంతటి అద్భుతమైన మ్యూజిక్ అందించాడో, ఈ సినిమాకు అంతకు మించిన మ్యూజిక్ ని అందించేందుకు సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండవ పాటని విడుదల చేయబోతున్నారు. ఇది చిరంజీవి, వెంకటేష్(Victory Venkatesh) కాంబినేషన్ లో వచ్చే పార్టీ సాంగ్ అట.
ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే వెంకటేష్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. నేటి నుండి ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కాసేపటి క్రితమే ఈ సాంగ్ ప్రోమో ని విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ పాటని విడుదల చేయబోతున్నారు. ఈ నెల రెండవ వారం లో ఈ సాంగ్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ తోనే వింటేజ్ అనిల్ రావిపూడి రేంజ్ ప్రొమోషన్స్ మొదలు అవ్వబోతున్నాయని టాక్. ఇంటర్వూస్, టీవీ షోస్ ఇలా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఏ రేంజ్ లో అయితే ప్రొమోషన్స్ చేశారో, అదే రేంజ్ లో ఈ చిత్రానికి కూడా చేయబోతున్నారు. ఇకపోతే చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ రాబోయే ఈ సాంగ్ అభిమానులకు కనుల పండుగ లాగా ఉండబోతుంది అట.
నిన్నటి తరంలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయినా చిరంజీవి, వెంకటేష్ లను ఇలా ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టమే. ఇన్నేళ్ల కెరీర్ లో వీళ్లిద్దరు కలిసి ఎప్పుడూ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించడం అంటే నిజంగానే మూవీ లవర్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఈ ఇద్దరి హీరోలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. అంతే కాకుండా ఇద్దరు కూడా కామెడీ మరియు సెంటిమెంట్ ని పండించడం లో కింగ్స్. వెంకటేష్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటాడట. ఇక మీరే ఊహించుకోవచ్చు ఆడియన్స్ కి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ దొరకబోతుంది అనేది.
Our beloved heroes,
Megastar @KChiruTweets garu and the Victorious @VenkyMama garu, are coming together to set the screens on fire with a MEGA-VICTORY MASS SONG in #ManaShankaraVaraPrasadGaruSong shoot in progress
Can’t wait to celebrate this Sankranthi 2026, it… pic.twitter.com/JZl9KgUgkk
— Anil Ravipudi (@AnilRavipudi) December 2, 2025