Liquor Shops: తెలంగాణ(Telangana)లో ఎమ్మెల్సీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుంది. మార్చి(March) 3న ఫలితాలు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే.. ప్రచారం మంగళవారం(ఫిబ్రవరి 25) సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ(Telangana exise department) మందుబాబులకు మింగుడు పడని వార్త చెప్పింది. మంగళవారం(ఫిబ్రవరి 25) సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 27వ తేదీన ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వైన్స్‌తోపాటు బార్‌లు, రెస్టారెంట్‌లు, స్టార్ హోటళ్లు, కల్లు దుకాణాలు మూసి వేయనున్నట్లు పేర్కొంది.
ఈ జిల్లాలో బంద్..
ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జిల్లాల్లో పట్టభద్రులు(Graduate), టీచర్(Teacher) ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడు ఉమ్మడి జిల్లాల్లో మద్యం షాపులు 48 గంటలు నిలిపివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎన్నికల నియమావళి ప్రకారం.. అధికారులు జారీ చేసిన జిల్లాల్లో ఎలాంటి మద్యం అమ్మకాలు జరుపకూడదు. వైన్స్ తెరవకూడాదు. కోడ్ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
27న పోలింగ్..
ఇదిలా ఉంటే.. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.