Petrol Problem: కారు కొనాలని చాలా మందికి ఆసక్తి ఉన్నా.. దీని Maintainance చూసి చాలా మంది కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తారు. ముఖ్యంగా పెట్రోల్ బాధలు భరించేవారికి మాత్రమే కారు సౌకర్యవంతంగా ఉంటుంది. అందులోనూ Petrol ధరలు విపరీతంగా పెరిగాయి. కాస్త దూరం వెళ్లాలంలే బోలెడు ఖర్చు అవుతుంది. అందుకే చాలా మంది కార్లను కొనుగోలు చేసి ఆ తరువాత సరిగ్గా మెయింటనెన్స్ చేయలేక తిరిగి అమ్ముకున్నవారున్నారు. అయితే ఇప్పుడు పెట్రోల్ సమస్య పరిష్కారారికి ఒక మార్గం దొరికింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కార్లకు పెట్రోల్ అవసరం లేదు. మరెలా ఎక్కువ Millage ఇస్తాయి. ఆ వివరాల్లోకి వెళితె..
చాలా మంది పెట్రెల్ సమస్యను దృష్టిలో ఉంచుకొని కారు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేశారు. దీంతో కొన్ని కంపెనీలు CNGకార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు సీఎన్ జీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తాజాగా Renault కంపెనీకి చెందిన కైగర్, ట్రైబర్, క్విడ్ కార్లు ఆకర్షిస్తున్నాయి. ఇవి పెట్రోల్, డీజిల్ తో కాకుండా సీఎన్ జీ వెర్షన్ లో పనిచేస్తాయి.
Renault కంపెనీకి ఇండియా మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే దీని నుంచి గతంలో మార్కెట్లోకి వచ్చి DUSTER కారును ఎంతో ఆదరించారు. ఆ తరువాత పోటీ కారణంగా సరైన కార్లను తీసుకురాలేకపోయింది. అయితే ఇప్పుడు సీఎన్ జీ వెర్షన్ లో మూడు కార్లను తాజాగా రిలీజ్ చేసింది. వీటిలో క్విడ్ , కైగర్, ట్రైబర్ లు ఉన్నాయి. ఈ మూడు కార్లు మారుతి, తాటా, హ్యుందాయ్ కార్లతో పోటీ పడే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా ఈ కంపెనీకి చెందిన కార్లు అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఇవి అన్ని రాష్ట్రాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనిని దక్కించుకోవాలంటే రూ. 75,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుత రోజుల్లో కారు కొనాలని అనుకునేవారు మైలేజ్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇలాంటి వారికి కోసం ఈ కార్లు అనుగుణంగా ఉంటాయి. ఈ కార్లు లీటర్ ఇంధనానికి 30 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. వీటిలో కైగర్ కాంపాక్ట్ ఎస్ యూవీగా, ట్రైబర్ కాంపాక్ట్ ఎంపీవీగా ఉన్నాయి. నేటి కాలంలో కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో మైలేజ్ తో పాటు వినియోగదారులకు అనుగుణంగా ఉండే ఈ కార్లను కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని అంటున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా మైలేజ్ కార్లను కోరుకుంటారు. వీరికి అనుగుణంగా ఈ కార్ల ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఆయా ప్రాంతాలను బట్టి ధర మారుతూ ఉంటుంది.