spot_img
HomeతెలంగాణKavitha New Party: కవిత కొత్త పార్టీ.. అసెంబ్లీలో జాగృతి ప్రతినిధులుగా అడుగు పెడతాం!

Kavitha New Party: కవిత కొత్త పార్టీ.. అసెంబ్లీలో జాగృతి ప్రతినిధులుగా అడుగు పెడతాం!

Kavitha New Party: అందరూ ఊహించిందే జరిగింది. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ప్రకటించారు. తన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలిలో చివరి ప్రసంగం చేసిన కవిత.. భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. నైతికత లేని బీఆర్‌ఎస్‌లో ఉండలేనని వెల్లడించారు. తర్వాత బయటకు వచ్చి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

అందరినీ కలుపుకుని పార్టీ..
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని వెల్లడించారు. తెలంగాణ జాగృతి ప్రతినిధులుగా అసెంబ్లీలో అడుగు పెడతామని ప్రకటించారు. ఇక తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానని, తెలంగాణలో వివక్ష, అణచివేతకు గురైనవారు తనతో కలిసిరావాలని కోరారు.

త్వరలో విధి విధానాలు..
తెలంగాణ జాగృతి పార్టీ ఎలా ఉండబోతుందో త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తానని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాని విద్యార్థులు, అన్యాయానికి గురైన కార్మికులు, కర్షకులు, ప్రజల పక్షాన పోరాటాలు చేసే కమ్యూనిస్టులు తనతో కలిపి రావాలని కోరారు. అందరికీ న్యాయం జరిగేలా పోరాడేందుకే తెలంగాణ జాగృతి పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్‌లోని తెలంగాణ వాదులు బయటకు రావాలన్నారు. తెలంగాణ ఉద్యమద్రోహుల రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper