తెలంగాణలో ఇంటర్‌‌ ఎగ్జామ్స్‌ ఎప్పుడంటే..?

ఇన్నాళ్లూ కరోనా కారణంగా ఇంటర్‌‌ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్ తరగతులు నిర్వహించడంతో పాటు… ఎగ్జామ్స్ కూడా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించి ఓ ప్రకటన చేసింది. ‘ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలపై విద్యార్థులకు ఓ వారంలో స్పష్టత ఇస్తాం. అలాగే సిలబస్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్నింటిపైనా వారంలో క్లారిటీ ఇస్తాం’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మంత్రి.. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూళ్లు, […]

Written By: Srinivas, Updated On : January 20, 2021 2:18 pm
Follow us on


ఇన్నాళ్లూ కరోనా కారణంగా ఇంటర్‌‌ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్ తరగతులు నిర్వహించడంతో పాటు… ఎగ్జామ్స్ కూడా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించి ఓ ప్రకటన చేసింది. ‘ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలపై విద్యార్థులకు ఓ వారంలో స్పష్టత ఇస్తాం. అలాగే సిలబస్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్నింటిపైనా వారంలో క్లారిటీ ఇస్తాం’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మంత్రి.. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలతో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలనే అంశంపై చర్చించారు.

Also Read: ఎక్కడున్న చోట అక్కడే కృష్ణా బోర్డు

స్కూళ్లలో రెగ్యులర్ తరగతులు తప్పనిసరి కాదన్న ఆమె.. ఫీజులకు సంబంధించి జారీ చేసిన జీవీ 46ని ప్రేవేట్ యాజమాన్యాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మేం వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోవచ్చు. కానీ క్రమంగా ఆ స్కూళ్లపై చర్యలు ఉంటాయి’ అని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం ఫీజుల అతిక్రమణకు సంబంధించి కోర్టులో 12 స్కూళ్ల కేసులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌లో ప్రారంభం అవుతాయని ఇటీవల బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు ప్రారంభమై మే మధ్య వరకు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన డేట్స్ త్వరలో ప్రకటిస్తామంది. దీనిపై ప్రభుత్వం వారంలో క్లారిటీ ఇవ్వనుంది.

ఈ పరీక్షల్లో 70 శాతం కరిక్యులమ్ ద్వారా ఉంటాయని.. మిగిలినది ప్రాజెక్టు, అసైన్‌మెంట్ల ద్వారా ఉంటుందని మంత్రి చెప్పారు. గతంలో ఇచ్చినట్టు ఐదు ప్రశ్నల్లో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయండి తరహాలో కాకుండా ఏడు ప్రశ్నలు ఇచ్చి వాటిలో మూడింటికి ఆన్సర్లు రాయండి అనేలా ఉంటుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

Also Read: ఆ ఎస్సై ఆత్మహత్య కేసులో ట్విస్టు

తెలంగాణలో కరోనా కారణంగా ఇప్పటి వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్ ద్వారా క్లాసులను చెబుతున్నారు. అయితే.. జూనియర్ కాలేజీలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 300 మంది కంటే తక్కువ ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 4 వరకు క్లాసులు అటెండ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. 300 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే రెండు షిఫ్టుల్లో క్లాసులు జరుగుతాయి. ఉదయం 8.30 నుంచి 12.30 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 వరకు రెండో షిఫ్ట్ క్లాసులు జరగనున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ముందు నిర్వహిస్తారు. ఆ తర్వాత థియరీ ఎగ్జామ్స్‌ పెడుతారు. వీటిపై స్పష్టమైన షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని బోర్డు అధికారి చెప్పారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్