https://oktelugu.com/

అప్పుడే అన్ని అనుమానాలెందుకు..?

ఏపీలో బీజేపీ ఊపు రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అక్కడి సమస్యలపై గళం విప్పుతూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ బాధ్యతలు సోము వీర్రాజు చేపట్టాక నూతన జవసత్వాలు వచ్చినట్లైంది. అయితే.. ఇటీవల రాష్ట్రంలో ఆలయాలపై దాడులు పెరిగిపోవడంతో పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి రథయాత్ర చేపట్టాలని సంకల్పించారు. అయితే.. వారు ఏర్పాట్లు ప్రారంభించక ముందే ఆ రథయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటుందని.. అలా ఆపడానికి ప్రయత్నిస్తే.. ప్రభుత్వానికి టైం దగ్గర […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 20, 2021 / 02:08 PM IST
    Follow us on


    ఏపీలో బీజేపీ ఊపు రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అక్కడి సమస్యలపై గళం విప్పుతూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ బాధ్యతలు సోము వీర్రాజు చేపట్టాక నూతన జవసత్వాలు వచ్చినట్లైంది. అయితే.. ఇటీవల రాష్ట్రంలో ఆలయాలపై దాడులు పెరిగిపోవడంతో పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి రథయాత్ర చేపట్టాలని సంకల్పించారు. అయితే.. వారు ఏర్పాట్లు ప్రారంభించక ముందే ఆ రథయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటుందని.. అలా ఆపడానికి ప్రయత్నిస్తే.. ప్రభుత్వానికి టైం దగ్గర పడినట్లేనని విమర్శలు ప్రారంభించారు.

    Also Read: ఎక్కడున్న చోట అక్కడే కృష్ణా బోర్డు

    ప్రతీ రోజూ ఎవరోఒకరు ప్రెస్‌మీట్లు పెట్టి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. రథయాత్ర చేయడానికి పర్మిషన్ అవసరమో లేదో.. అవసరం అయితే.. దరఖాస్తు చేసుకున్నారో లేదో అసలు ఎవరికీ తెలియదు. ప్రారంభానికి రెండు వారాలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే అడ్డుకుంటారని విమర్శలు ప్రారంభించారు. యాత్రను అడ్డుకుంటామని ప్రభుత్వం కానీ.. పోలీసులు కానీ ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. చినజీయర్ స్వామి యాత్ర చేస్తుంటే ఎవరూ అడ్డుకోలేదు.

    అయితే.. బీజేపీ నేతలు మాత్రం చేస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు. కానీ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వాళ్లు అలా రెచ్చగొడతారో లేదో కానీ ముందుగా పోలీసుల్ని మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాత్ర చేసే ఉద్దేశం లేక.. ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శలు చేయడానికో లేకపోతే తాము ప్రారంభించబోయే యాత్రకు హైప్ తెచ్చుకోవడానికో బీజేపీ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Also Read: ఆ ఎస్సై ఆత్మహత్య కేసులో ట్విస్టు

    గతంలో రామతీర్థం వెళ్లాలనుకున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కపిల తీర్థం టు రామతీర్థంను కూడా అడ్డుకుంటారన్న అనుమానాలు వారిలో బలపడుతున్నాయి. అయితే.. ఓ రాజకీయ పార్టీ పెట్టుకున్న కార్యక్రమాన్ని అడ్డుకునే సంప్రదాయం ఏపీలో లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాసమస్యలపై పోరాటానికి ప్రతిపక్ష నేతలు వెళ్లినా అడ్డుకుంటోంది. సొంత కార్యకర్తలతో రాళ్లు వేయించడం.. వంటి పనులు కూడా చేయిస్తోంది. పోలీసులు నిమిత్త మాత్రులుగా మిగిలిపోయారు. ఇలాంటి సమయంలో బీజేపీ ముందుగానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలోనూ పెద్దగా రాజకీయం ఏమీ లేనట్లే కనిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్