ఏపీలో పంచాయతీ ఎన్నికల అంశం రోజుకో మలుపు తిప్పుతోంది. ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించడం.. వద్దంటూ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కడం పరిపాటైంది. అయితే.. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వగా.. దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఇక ఉత్తర్వులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Also Read: అప్పుడే అన్ని అనుమానాలెందుకు..?
ఈ వ్యవహారానికి సంబంధించి ఇరు వర్గాల వాదోపవాదాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను వినిపించింది. అయితే.. కోవిడ్-19 వ్యాక్సినేషన్ జరుగుతున్నది కేవలం కొంతమంది ఉద్యోగుల మీదే కాబట్టి.. ప్రభుత్వ వాదనతో పని లేకుండా ఏపీ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరగాలనేది ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ ప్రాధాన్యత వ్యాక్సినేషనే అని, ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అయితే.. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున వినిపించిన వాదనల్లోని ఒక అంశాన్ని ధర్మాసనం తప్పు పట్టినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఇష్టంతో లేదనే వాదనను ఆయన తరఫున న్యాయవాది వినిపించినట్టుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వాదనను ధర్మాసనం తప్పు పట్టిందని పత్రికలు పేర్కొన్నాయి. ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు ఏమీ చెప్పలేదు.
Also Read: ఎక్కడున్న చోట అక్కడే కృష్ణా బోర్డు
ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనేది మాత్రమే ప్ఱభుత్వం వాదిస్తోంది. కానీ.. ఆయన హయాంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎక్కడా చెప్పడం లేదు. అయితే నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా, దాన్ని కోర్టు తప్పు పట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అంశం మరింత ఆసక్తిదాయకంగా మారింది. అంతేకాదు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఎప్పుడు ఎంత మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇవ్వబోతున్నది విషయాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు అందించిందట. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ధర్మాసనం నుంచి ఎలాంటి తీర్పు వస్తుందా అని ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్