HomeతెలంగాణTelangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు 2026.. భారీగా పెరిగిన ఉత్తీర్ణత..

Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు 2026.. భారీగా పెరిగిన ఉత్తీర్ణత..

Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు 2026 ఫలితాలను ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం మీద ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగింది. ముఖ్యంగా బాలికలు మరోసారి తమ ప్రతిభను నిరూపించుకుని, బాలురకంటే మెరుగైన ఫలితాలు సాధించారు.

బాలికలదే హవా
ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల్లో మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా నమోదైంది.

ప్రథమ సంవత్సరంలో 4,89,123 మంది పరీక్ష రాయగా, 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. 66.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 74.40 శాతం ఉత్తీర్ణ, బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 5,07,948 మంది పరీక్ష రాయగా, 3,58,490 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 78.65 శాతం, బాలురు 62.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు సుమారు 15–17 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఇది తెలంగాణలో బాలికల విద్యాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

గతేడాదికన్న మెరుగు..
2025 ఫలితాలతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతంలో మంచి పెరుగుదల కనిపించింది. 2025లో ఫస్ట్‌ ఇయర్‌లో 66.91 శాతం, సెకండియర్‌లో 72,43 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫస్ట్‌ ఇయర్‌లో 66.20 శాతం, సెకండియర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో స్వల్ప తగ్గుదల కనిపించినా, ద్వితీయ సంవత్సరంలో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.

సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌..
ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు బోర్డు అవకాశాలు కల్పించింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన తేదీలును యోగిత రాణా ప్రకటించారు. రీకౌంటింగ్‌ / రీవెరిఫికేషన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 13 నుంచి 20 వరకు చేసుకోవాలి. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఏప్రిల్‌ 13 నుంచి 20 వరకు చెల్లించాలి. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల మే 13 నుంచి జరుగుతాయి. ప్రాక్టికల్‌స మే 22న నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం సెషన్‌లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

ఫలితాలు ఎలా చూసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను కింది వెబ్‌సైట్లలో సులభంగా చూసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ https://tgbie.in లో అందుబాటులో ఉన్నాయి. హాల్‌ టికెట్‌ నంబర్, విద్యార్థి వివరాలను నమోదు చేస్తే చాలు, మార్కుల మెమో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో బాలికల ఆధిపత్యం కొనసాగడం, మొత్తం ఉత్తీర్ణత శాతం స్థిరంగా ఉండడం శుభపరిణామం. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవ్వాలి. రీకౌంటింగ్‌ కావాలనుకునే వారు ఏప్రిల్‌ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular