Homeఎంటర్టైన్మెంట్LIK Movie 2 Days Collection: ఫ్లాప్ టాక్ తో కూడా ఇరగదీస్తున్న ప్రదీప్ రంగనాథన్...

LIK Movie 2 Days Collection: ఫ్లాప్ టాక్ తో కూడా ఇరగదీస్తున్న ప్రదీప్ రంగనాథన్ ‘LIK’..2 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

LIK Movie 2 Days Collection: వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , ఇప్పుడు ‘LIK’ చిత్రం తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలి మూడు సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ఒక బలమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం వల్ల , LIK చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా, బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం మొదటి […]

LIK Movie 2 Days Collection: వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , ఇప్పుడు ‘LIK’ చిత్రం తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలి మూడు సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ఒక బలమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం వల్ల , LIK చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా, బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు , రెండవ రోజున కూడా ఈ చిత్రానికి స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. వరల్డ్ వైడ్ గా మొదటి రోజుకంటే రెండవ రోజునే ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు తెలుగు తమిళ భాషలకు కలిపి 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా , రెండవ రోజున 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 22 కోట్ల రూపాయిల రేంజ్ లో ఈ చిత్రానికి గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అందులో వర్సెల్ సనుండి 5 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వాస్తవానికి ఇది ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ కంటే చాలా తక్కువ వసూళ్లు అనే చెప్పాలి. కానీ ఎప్పుడో రెండేళ్ల క్రితం షూటింగ్ ని పూర్తి చేసుకున్న సినిమా , ఆడియన్స్ లో పెద్దగా అంచనాలను క్రియేట్ చెయ్యలేదు, అయినప్పటికీ ఈ మాత్రం ఓపెనింగ్ వచ్చిందంటే , అది ప్రదీప్ బ్రాండ్ ఇమేజ్ కారణంగానే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా తమిళనాడు లో ఉండే జెన్ జీ యూత్ ఆడియన్స్ మొత్తం ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే టాక్ తో సంబంధం లేకుండా, తమిళనాడు వరకు ఈ చిత్రం ఇరగకుమ్మేస్తోంది.

ఓవరాల్ గా వీకెండ్ మొత్తానికి కలిపి ఈ చిత్రానికి 33 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వస్తాయని , క్లోజింగ్ లో 45 నుండి 50 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి మూడు సినిమాలతో నాన్ స్టాప్ గా వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతూ ముందుకెళ్లిన ప్రదీప్ , ఈ సినిమాతో కూడా మరో 100 కోట్ల గ్రాస్ ని తన ఖాతాలో వేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆడియన్స్ లో మౌత్ టాక్ బాగాలేకపోవడం తో ఈ చిత్రం ఆ స్థాయికి చేరుకునే అవకాశాలు పోయాయి. ఇకపోతే నేడు బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నేడు కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper