Gadwal MLA : గద్వాల ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత.. ముగిసే ముందు ఎమ్మెల్యే అయిన డీకే అరుణ!

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ చివరి దశకు రావడంతో.. ఊహించని తీర్పులు వస్తున్నాయి.

Written By: NARESH, Updated On : August 24, 2023 4:18 pm

Gadwal mla

Follow us on

Gadwal MLA : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తరహాలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కూడా పదవి కోల్పోయారు. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని నిర్ధారణ కావడంతో ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. సమీప ప్రత్యర్థి డీకే అరుణను విజేతగా ప్రకటించింది.

డీకే అరుణ పిటిషన్‌..
2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డీకే.అరుణ దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్‌∙వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది. మళ్లీ ఎన్నికల కోసం కేసీఆర్‌ .. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులోనూ.. కృష్ణమోహన్‌ రెడ్డి అభ్యర్థిగా చోటు దక్కించుకున్నారు.

ఇటీవలే కొత్తగూడెం ఎమ్మెల్యేపై..
కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు పైనా ఇలాగే అనర్హతా వేటు వేశారు. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమాతో పోటీలో ఓడిపోయిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టు స్టేతో ప్రమాణస్నీకారం చేయలేకపోయారు.

ఆలస్యం చేసిన స్పీకర్‌..
సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసినందున.. తీర్పును ప్రభుత్వం.. అసెంబ్లీ స్పీకర్‌ వెంటనే అమలు చేసే అవకాశం ఉండదని.. కృష్ణమోహన్‌ రెడ్డి కూడా.. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో స్టే లభిస్తే… పదవీ కాలం ముగిసిపోయే వరకూ తేలే అవకాశం ఉండదని చెప్పవచ్చు. మొత్తంగా… ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ చివరి దశకు రావడంతో.. ఊహించని తీర్పులు వస్తున్నాయి.