TG Half Day Schools: తెలంగాణ ప్రభుత్వం కుల గణనకు సిద్ధమైంది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభించాలని నిర్ణయించింది. సుమారు మూడు వారాలపాటు ఈ సర్వే కొనసాగనుంది, ఈమేరకు ఏర్పాట్లు చేసింది. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణన సర్వే నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లను మినహాయించింది. ఈమేరకు (నవంబర్1న) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కుల గణన విధుల నిర్వహించేందుకు 80 వేల మందిని ఎంపిక చేసింది. వీరికి శిక్షణ కూడా ఇచ్చింది. వీరిలో 36,549 మంది ఎస్జీటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వీళ్లతోపాటు 6,256 మంది ఎంఆర్‌సీలు, 2 వేల మంది మినీస్టీరియల్ సిబ్బంది కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనేలా ప్రణాళిక రూపొంఇంచింది.
పాఠశాలల పని వేళల మార్పు..
కుల గణన నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు సర్వే నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక సమగ్ర కుటుంబ సర్వేలో విద్యాభ్యాసానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించనుంది. విద్యార్హతలు, అత్యున్నత విద్య ఏమాధ్యమంలో చదివారనే వివరాలతోపాటు పాఠశాలలో చేరిన నాటికి వయసు, బడి మానేసినట్లయితే అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఇక çసర్వే కోసం ప్రైమరీ స్కూళ్లలో 3 వారాలపాటు పాఠశాలల పనివేళలు మార్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే మూడు వారాలు పాఠశాలలు పని చేయనున్నాయి.