https://oktelugu.com/

TDP  official X account : విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందా? సంచలన పోస్ట్

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి వివాదం రేగిన సంగతి తెలిసిందే.గత కొద్దిరోజులుగా ఈ వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 2, 2024 / 10:50 AM IST

    conspiracy to kill YS Vijayamma

    Follow us on

    TDP  official X account :  ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టిడిపి, వైసీపీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. వైయస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం పైన అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిపై వాడి వేడి చర్చ నడుస్తోంది. తన చెల్లెలు,తల్లి తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి పోస్ట్ చేసిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టిడిపి అధికారిక ఎక్స్ ఖాతాలో వైయస్ విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందని అర్థం వచ్చేలా పెట్టిన పోస్ట్సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు బాబాయ్ వైయస్ వివేక ని లేపేసినట్టే.. 2024 ఎన్నికలకు ముందు కూడా విజయమ్మ హచ్ కుట్ర జరిగిందని అర్థం వచ్చేలా టిడిపి పోస్ట్ పెట్టింది. ఇది సంచలనంగా మారుతుంది. వైయస్ విజయమ్మ కారు వీడియోతో పెట్టిన ఈ పోస్టులో రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు అంటూ షాకింగ్ విషయం చెప్పింది. వందలాది మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది అంటూ టిడిపి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది.

    * ఖరీదైన కారు
    అత్యంత ఖరీదైన కారు గా కనిపిస్తోంది. అయినప్పటికీ రెండు చక్రాలు ఊడిపోయాయి. దానినే హైలెట్ చేసింది టిడిపి. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై ఎండ్ కారు, అందునా కొత్త కారుకు ఇలా జరగడం చూసి ముందు ఆశ్చర్యపోయి.. తర్వాత మన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి.. ఏం జరిగిందో చాలామంది ఊహించారు అంటూ పరోక్షంగా వైయస్ జగన్ టార్గెట్ చేసింది టిడిపి సోషల్ మీడియా. 2019 ఎన్నికలకు బాబాయిని లేపేసినట్టే.. ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్నా సమయంలో ఇది జరిగిందని వ్యంగ్యంగా చెప్పుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.

    * పతాక స్థాయికి ఆస్తి వివాదం
    ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం పతాక స్థాయికి చేరింది. మొన్నటి వరకు జగన్ వర్సెస్ షర్మిల అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ ఉన్నట్టుండి విజయమ్మ సైతం షర్మిలకు బాహటంగా మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిపై వైసీపీలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీ కారు వీడియోను వైరల్ చేయడం ఆసక్తి రేపుతోంది.